Axar Patel Injury: భారత జట్టుకు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్!
ABN , Publish Date - Dec 15 , 2025 | 07:56 PM
డిసెంబర్ 17న భారత్, సౌతాఫ్రికా మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో నాలుగో టీ20 మ్యాచ్ కు ముందు భారత్ కు బిగ్ షాక్ తగిలింది.
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో 2-1తో భారత్(India South Africa T20 series) ఆధిక్యంలో ఉంది. ఆదివారం జరిగిన మూడో టీ20లో గెలిచి..టీమిండియా జోరు మీద ఉంది. ఎలాగైనా టీ20 సిరీస్ ను గెలవాలనే పట్టుదలతో భారత్ జట్టు ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. అనారోగ్యం కారణంగా మూడో టీ20 మ్యాచ్‌కు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ ఒకరు.. మిగిలిన రెండు టీ20లకు కూడా అందుబాటులో ఉండటం లేదని సమాచారం. మరీ.. స్టార్ ప్లేయరు, ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ధర్మశాలలో ఆదివారం జరిగిన మూడో టీ20లో మ్యాచ్‌లో భారత్ తమ తుది జట్టులో రెండు మార్పులతో బరిలోకి దిగింది. ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాలతో దూరం కాగా.. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(Axar Patel)కు విశ్రాంతినిచ్చారు. అయితే, తాజా సమాచారం ప్రకారం అక్షర్ పటేల్ (Axar Patel) అనారోగ్యానికి గురయ్యాడని.. మిగిలిన రెండు మ్యాచ్‌లకు కూడా దూరమయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే ఇప్పటికే బుమ్రా( Bumrah) రూపంలో కీలక బౌలర్ దూరం కాగా.. అక్షర్ కూడా అందుబాటులో లేకుంటే తుది జట్టు కూర్పు విషయంలో కాస్త గందరగోళం నెలకొనవచ్చని క్రీడా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇదిలా ఉంటే.. భారత్- సౌతాఫ్రికా మధ్య నాలుగో టీ20 లక్నోలో బుధవారం(డిసెంబర్ 17) జరుగనుంది. ఆఖరి మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం(డిసెంబర్ 18) జరగనుంది.
టీ20 సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టు
అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా.
ఇవి కూడా చదవండి:
ఆ ఒక్క రోజు నేనలా చేయకపోయుంటే!.. గబ్బర్ కీలక వ్యాఖ్యలు
వాళ్లిద్దరికీ ఆ సత్తా ఉంది.. సూర్య, గిల్‌కు అభిషేక్ శర్మ మద్దతు