Share News

IND vs NZ Series: న్యూజిలాండ్‌ జట్టు ప్రకటన.. గాయాల వల్ల స్టార్ ప్లేయర్లు దూరం

ABN , Publish Date - Dec 24 , 2025 | 11:03 AM

వచ్చే ఏడాది భారత్ తో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీసులకు న్యూజిలాండ్ తమ జట్లను ప్రకటించింది. టీ20, వన్డే జట్లకు ఇద్దరు కెప్టెన్లను కివీస్ సెలక్టర్లు ప్రకటించారు. గాయం కారణంగా కీలక ప్లేయర్లు ఈ సిరీసులకు దూరం అయ్యారు.

IND vs NZ Series: న్యూజిలాండ్‌ జట్టు ప్రకటన.. గాయాల వల్ల స్టార్ ప్లేయర్లు దూరం
IND vs NZ series

ఇంటర్నెట్ డెస్క్: వచ్చే ఏడాది జనవరిలో భారత్ తో న్యూజిలాండ్(IND vs NZ series) పరిమిత ఓవర్ల సిరీసులు ఆడనుంది. ఈ క్రమంలో కివీస్ తమ జట్లను ప్రకటించింది. అయితే గాయాల కారణంగా కొందరు స్టార్ ప్లేయర్లు ఈ సిరీసులకు దూరంగా కాగా.. మరికొందరు గాయాల నుంచి కోలుకుని పునరాగమనం చేయనున్నారు. రెగ్యులర్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ భారత పర్యటనలో భాగంగా పునరాగమనం చేయనున్నాడు. టీ20 సిరీస్‌కు సాంటర్న్ ను ఎంపిక చేశారు. అయితే, ఫిట్‌నెస్‌ దృష్ట్యా వన్డే సిరీస్‌కు సెలక్టర్లు అతడికి విశ్రాంతినిచ్చారు.


వన్డే సిరీస్ కు, టీ20 సిరీస్ కు ఇద్దరు కెప్టెన్లను న్యూజిలాండ్(New Zealand squad) ప్రకటించింది. టీ20 సిరీస్‌ సాంట్నర్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వన్డేల్లో సాంట్నర్‌కు బదులు మైకేల్‌ బ్రేస్‌వెల్ సారథ్యం వహించనున్నాడు. మరోవైపు.. పేసర్‌ కైలీ జెమీషన్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకుని భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లలో భాగం కానున్నాడు. ఇక ముందుగా ఊహించినట్లుగానే మాజీ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌.. దక్షిణాఫ్రికా టీ20లో భాగమైన నేపథ్యంలో.. భారత్‌ వన్డే సిరీస్‌కు దూరంగా ఉండనున్నాడు. మిగిలిన వారిలో నాథన్‌ స్మిత్‌, బ్లెయిర్‌ టిక్నర్‌, మార్క్‌ చాప్‌మన్‌, మ్యాట్‌ హెన్రీ గాయాల వల్ల ఆటకు దూరమయ్యారు. ఇదిలా ఉంటే.. టామ్‌ లాథమ్‌ తన మొదటి సంతానానికి ఆహ్వానం పలికే క్రమంలో ఈ పర్యటనకు మిస్సయ్యాడు. జేకబ్‌ డఫీ, రచిన్‌ రవీంద్రలకు కూడా వన్డేల నుంచి విశ్రాంతినిచ్చారు. మరోవైపు.. లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ జేడెన్‌ లెనాక్స్‌ను తొలిసారి నేషనల్ జట్టుకు ఎంపికయ్యాడు. క్రిటిసాన్‌ క్లార్క్‌, ఆది అశోక్‌, జోష్‌ క్లార్క్‌సన్‌, నిక్‌ కెల్లీ, మేకేల్‌ రేలకు కూడా మేనేజ్‌మెంట్‌ ఈ జట్లలో చోటు కల్పించింది.


వన్డేలకు న్యూజిలాండ్‌ జట్టు

మైకేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్‌), ఆది అశోక్, క్రిస్టియన్ క్లార్క్, జోష్ క్లార్క్‌సన్‌, డెవాన్ కాన్వే, జాక్ ఫౌల్క్స్, మిచ్ హే, కైలీ జెమీషన్‌, నిక్ కెల్లీ, జేడెన్ లెనాక్స్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మైకేల్ రే, విల్ యంగ్.

టీ20లకు న్యూజిలాండ్‌ జట్టు

మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జేకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, కైలీ జెమీషన్‌, బెవాన్ జాకబ్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ రాబిన్సన్, ఇష్ సోధి.


IND VS NZ షెడ్యూల్‌

  • మూడు వన్డేల సిరీస్‌

  • జనవరి 11న వడోదర

  • జనవరి14న రాజ్‌కోట్

  • జనవరి 18న ఇండోర్

ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌

  • జనవరి 21న నాగ్ పూర్

  • జనవరి 23న రాయ్ పూర్

  • జనవరి 25న గువహటి

  • జనవరి 28న విశాఖ పట్నం

  • జనవరి 31న తిరువనంతపురం

Updated Date - Dec 24 , 2025 | 11:03 AM