Ind Vs SA: మైదానంలో కుల్‌దీప్‌తో కోహ్లీ డ్యాన్స్.. వీడియో వైరల్
ABN , Publish Date - Dec 06 , 2025 | 06:14 PM
మూడో వన్డేలో కుల్‌దీప్ వికెట్ తీసిన వెంటనే కోహ్లీ చేసిన సరదా డ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బోష్ ఔట్ అయిన తర్వాత కోహ్లీ, కుల్‌దీప్‌తో కలిసి చేసిన ఫన్నీ సెలబ్రేషన్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ఇంటర్నెట్ డెస్క్: విశాఖపట్నం వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మూడో వన్డేలో తలపడుతున్నాయి. 20 వరుస వన్డేల తర్వాత టాస్ గెలిచిన టీమిండియాకు అదృష్టం కలిసొచ్చింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. తొలి ఇన్నింగ్స్‌లో 47.5 ఓవర్లలోనే సఫారీ బ్యాటర్లు కుప్పకూలారు. భారత్(Ind Vs SA)కు 271 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. కుల్‌దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో నాలుగు వికెట్లు తీసి.. సౌతాఫ్రికా పతనాన్ని శాసించారు.
ఫుల్ జోష్‌లో కింగ్ కోహ్లీ..
వైజాగ్ స్టేడియంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఫుల్ జోష్‌లో కనిపించాడు. టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ ఈ ఇన్నింగ్స్‌లో 4/41తో రాణించాడు. అతడి వికెట్ సెలబ్రేషన్‌లో కోహ్లీ చేసిన సరదా డాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 43వ ఓవర్ మూడో బంతికి కుల్‌దీప్ బౌలింగ్‌లో బోష్(9).. అతడికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వెంటనే అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చిన కోహ్లీ.. కుల్‌దీప్‌ని ఆటపట్టిస్తూ డ్యాన్స్ చేశాడు. ఆ వీడియో తెగ నవ్వు తెప్పిస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సౌతాఫ్రికా ఆలౌట్.. భారత్ టార్గెట్ 271
రికార్డు సృష్టించిన క్వింటన్ డికాక్