IND vs ENG: నేడు భారత్ vs ఇంగ్లండ్ రెండో వన్డే.. ఎవరు గెలిచే చాన్సుంది, ప్రిడిక్షన్ ఎలా ఉందంటే..
ABN , Publish Date - Feb 09 , 2025 | 08:25 AM
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో వన్డే కీలక మ్యాచ్ జరగనుంది. అయితే మొదటి మ్యాచ్ ఇంగ్లండ్ జట్టు ఓడిన నేపథ్యంలో ఈ గేమ్ ఉత్కంఠగా మారనుంది. కటక్ వేదికగా మధ్యాహ్నం 1:30కి మొదలు కానున్న ఈ మ్యాచులో ఎవరు గెలిచే ఛాన్సుందనే విషయాలను ఇక్కడ చూద్దాం.
భారత్ (Team india), ఇంగ్లండ్ (England) మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఈరోజు రెండో మ్యాచ్ కటక్‌లోని బారాబతి స్టేడియంలో మధ్యాహ్నం 1:30 గంటలకు జరగనుంది. నాగ్‌పూర్‌లో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్ 1-0తో ఆధిక్యంలో ఉంది. కటక్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే, సిరీస్ కైవసం చేసుకుంటుంది. మరోవైపు ఇంగ్లండ్ జట్టు కూడా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను కొనసాగించాలని భావిస్తోంది. కాబట్టి ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా కొనసాగనుంది.
పిచ్ పరిస్థితులు
బారాబతి స్టేడియం పిచ్‌పై ఫాస్ట్ బౌలర్లకు పెద్దగా సహాయం ఉండకపోవచ్చు. ఈ పిచ్ సాధారణంగా నెమ్మదిగా ఉంటుంది. అందువల్ల స్పిన్ బౌలర్లు ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. రెండో ఇన్నింగ్స్‌లో డ్యూ కారణంగా బౌలర్లు పట్టు సాధించడం కష్టతరం అవుతుంది. ఈ కారణంగా టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకోవచ్చు.
ఇంగ్లండ్ జట్టు ప్రదర్శన
ఇంగ్లండ్ జట్టు ఇప్పటికే T20 సిరీస్‌ను 1-4తో కోల్పోయింది. కానీ ఇప్పుడు వారు ODI సిరీస్ దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జోస్ బట్లర్ సారథ్యంలోని ఇంగ్లిష్ జట్టు, సిరీస్ తమ చేతుల్లోంచి జారిపోకుండా ఉపయోగించుకోవాలని చూస్తోంది. ఇంగ్లండ్ జట్టులో ఉన్న కీలక ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో మరింత ఫోకస్ చేసే ఆడే అవకాశం ఉంది.
హెడ్ టు హెడ్ రికార్డ్
రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 108 ODI మ్యాచ్‌లు జరిగాయి. అందులో భారత్ 59 మ్యాచ్‌లు గెలువగా, ఇంగ్లండ్ 44 మ్యాచ్‌లను గెలిచింది. 2 మ్యాచ్‌లు టైగా ముగిశాయి. 3 మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగిశాయి. ఈ గణాంకాల ప్రకారం చూస్తే భారత్ లీడ్ కొనసాగుతోంది. కానీ ఇంగ్లండ్ జట్టు కూడా మంచి ఆటగాళ్లతో ఉంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో ఏదైనా జరగవచ్చు. గూగుల్ అంచనా ప్రకారం టీం ఇండియా గెలిచేందుకు 68 శాతం అవకాశం ఉండగా, ఇంగ్లండ్ జట్టుకు 32 శాతం ఛాన్సుంది.
ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్
భారత జట్టు: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (c), శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (wk), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్‌దీప్ సింగ్ యాదవ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్, అర్ష్ పంత్ చక్రవర్తి, వాషింగ్టన్.
ఇంగ్లండ్ జట్టు: ఫిలిప్ సాల్ట్(wk), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(c), జాకబ్ బెథెల్, లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్సే, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, సాకిబ్ మహమూద్, గస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, జామీ ఓవర్టన్, జామీ ఓవర్టన్
ఇవి కూడా చదవండి:
Gold and Silver Rates Today: రెండు వేలకుపైగా పెరిగిన గోల్డ్.. వెండి ధర ఎలా ఉందంటే..
8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
Read More Business News and Latest Telugu News