IND VS AUS: తొలి వన్డేలో భారత్ ఓటమి..
ABN , Publish Date - Oct 19 , 2025 | 05:23 PM
ఆస్ట్రేలియా పర్యటనను భారత్ ఓటమితో ఆరంభించింది. మూడు వన్డేల్లో భాగంగా పెర్త్‌లో జరిగిన తొలి వన్డేలో టీమిండియాపై ఆసీస్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియా పర్యటనను భారత్ ఓటమితో ఆరంభించింది. మూడు వన్డేల్లో భాగంగా పెర్త్‌లో జరిగిన తొలి వన్డేలో టీమిండియాపై ఆసీస్(Australia win) 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా(Team India).. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. మ్యాచ్‌కు వాన పలుమార్లు ఆటంకం కలిగించడంతో ఆటను అంఫైర్లు 26 ఓవర్లకు కుదించారు. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఆస్ట్రేలియాకు 131 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. 21.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (46 నాటౌట్.. 52 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), జోష్ ఫిలిప్ (37 రన్స్.. 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగి ఆడారు. అర్ష్ దీప్, అక్షర్, సుందర్ తలో వికెట్ తీసుకున్నారు. రెండో వన్డే గురువారం (అక్టోబర్ 23) జరగనుంది.
టాస్ ఓడి.. తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు(India vs Australia) ఆదిలోనే షాక్ తగిలింది. 25 పరుగులకే కీలక వికెట్లను భారత్ కోల్పోయింది. విరాట్ కోహ్లీ డకౌట్ కాగా.. రోహిత్ శర్మ 8 పరుగులు, శుభ్‌మన్ గిల్ 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. కేఎల్ రాహుల్ (38) టాప్ స్కోరర్ కాగా.. అక్షర్ పటేల్ (31), నితీశ్ రెడ్డి(19) ఫర్వాలేదనిపించారు. శ్రేయస్ అయ్యర్ (11), వాషింగ్టన్ సుందర్ (10), పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్ల(Australia Bowlers)లో హేజిల్‌వుడ్, మిచెల్ ఓవెన్, కునెమన్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. మిచెల్ స్టార్క్, నాథన్ ఎలిస్‌కు చెరో వికెట్ దక్కింది. మొత్తంగా తొలి వన్డేను భారత్( India ODI loss) పేలవంగా ప్రారంభించడంతో క్రికెట్ ఫ్యాన్స్ తీవ్రంగా నిరుత్సాహం చెందారు.
ఇవి కూడా చదవండి:
Virat Kohli Duck Record: కోహ్లీ చెత్త రికార్డ్.. 13 ఏళ్లలో ఇదే తొలిసారి!
Mitchell Starc Fastest Ball: చిన్న మిస్టేక్.. మిచెల్ స్టార్క్ వరల్డ్ రికార్డ్!