Harmanpreet Kaur: ఆ ఓటమి మాలో మార్పు తెచ్చింది: హర్మన్
ABN , Publish Date - Nov 03 , 2025 | 01:59 PM
ఐసీసీ మహిళా వన్డే ప్రపంచ కప్ 2025.. భారత మహిళా జట్టు తొలిసారి ట్రోఫీని ముద్దాడిన రోజు. ఒకానొక దశలో సెమీస్‌కు చేరుకోవడమే కష్టమనే పరిస్థితికి వచ్చింది. ఒక్కసారిగా పుంజుకుని పోరాడి నిలిచి గెలిచింది. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడింది.
ఇంటర్నెట్ డెస్క్: నవంబర్ 2.. మహిళా క్రికెట్ చరిత్రలోనే ఓ చిరస్మరణీయ రోజు. ఐసీసీ మహిళా వన్డే ప్రపంచ కప్ 2025(Women’s ODI World Cup final).. భారత మహిళా జట్టు తొలిసారి ట్రోఫీని ముద్దాడిన రోజు. ఒకానొక దశలో సెమీస్‌కు చేరుకోవడమే కష్టమనే పరిస్థితికి వచ్చింది. ఒక్కసారిగా పుంజుకుని పోరాడి నిలిచి గెలిచింది. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) మాట్లాడింది.
‘ఈ విజయం వెనకు ప్రతి ప్లేయర్ కష్టం ఉంది. మేనేజ్‌మెంట్ నుంచి వచ్చిన మద్దతోనే ఇది సాధ్యమైంది. గత నెల మాకు చాలా ఆసక్తికరంగా సాగింది. మా ప్రణాళికలు సరిగ్గా అమలు కాలేదు. అయినా సరే పాజిటివ్‌గా ముందుకు సాగాం. ఇప్పుడు కప్‌ను సగర్వంగా అందుకోగలిగామంటే దానికి కారణం అదే. ఇంగ్లండ్‌తో మ్యాచ్ ఓడిపోవడం మమ్మల్ని తీవ్రంగా బాధించింది. విజయానికి చేరువగా వచ్చి చేజార్చుకున్నాం. గతంలోనూ ఇలాంటివి చవి చూసినప్పటికీ.. ఈసారి మాత్రం ఆ బాధను తట్టుకోలేకపోయాం. అయితే మేం ఆ ఓటమికి డీలా పడకుండా.. నెక్ట్స్ ఏం చేయాలనే దానిపై దృష్టి పెట్టాం’ అని హర్మన్ తెలిపింది.
అదే చేశాం..
‘మా కోచ్ ‘చేసిన పొరపాటును మళ్లీ మళ్లీ చేయొద్దు. ఆ లైన్ క్రాస్ చేయాలి’ అని అన్నారు. ఆయన చెప్పినట్టు గానే తర్వాత రోజు నుంచి చాలా మారిపోయాం. ప్రతిసారీ చేసిన పొరపాట్లను చేయకూడదని నిర్ణయించుకున్నాం. ఇంగ్లండ్‌తో మ్యాచ్ మిమ్మల్ని పూర్తిగా మార్చేసింది. ఆ ప్రభావం ప్రతి ఒక్కరిపై పడింది. ప్రపంచ కప్‌ను గెలిచామని ఊహించుకోవడం మొదలు పెట్టాం. ఆటను ఆస్వాదించడంతోనే ఇలా విజేతగా నిలిచాం’ అని హర్మన్ ప్రీత్ వెల్లడించింది.
వెనకుండి నడిపించారు..
‘టీమిండియా వన్డే ప్రపంచ కప్ గెలవడంలో ప్లేయర్లు కీలక పాత్ర పోషించారు. కానీ మమ్మల్ని వెనకుండి నడిపించింది మాత్రం మా కోచ్ అమోల్ మజుందార్(Amol Muzumdar) సర్. ఆయన వచ్చాక డ్రెస్సింగ్ రూమ్‌లో చాలా మార్పులు వచ్చాయి. జట్టులో కూడా చాలా మార్పులు జరిగాయి. రాత్రింబవళ్లు ప్రాక్టీస్ చేయించారు. జట్టును నిర్మించారు. ఈ రెండున్నర ఏళ్లలో ఆయన ఇచ్చిన కోచింగ్‌తోనే ఛాంపియన్‌గా అవతరించగలిగాం. మజుందార్ ఆధ్వర్యంలో పనిచేసే అవకాశం రావడం నిజంగా మా అదృష్టం’ అని కౌర్ వ్యాఖ్యానించింది.
ఇవి కూడా చదవండి:
BCCI Cash Reward: ఉమెన్ ఇన్ బ్లూకు డబ్బే.. డబ్బు. రూ. 51 కోట్ల క్యాష్ ప్రైజ్, ఇంకా ఎన్నో..
Global Tech Giants-Cricket: భారత మహిళా క్రికెట్ జట్టుకు గ్లోబల్ టెక్ దిగ్గజాల అభినందనలు