Global Tech Giants-Cricket: భారత మహిళా క్రికెట్ జట్టుకు గ్లోబల్ టెక్ దిగ్గజాల అభినందనలు
ABN , Publish Date - Nov 03 , 2025 | 07:34 AM
మహిళల ప్రపంచ కప్‌లో విజయం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టును ప్రపంచ టెక్ దిగ్గజాలు పొగడ్తలతో ముంచెత్తారు. ఇదొక నిర్మాణాత్మక క్షణమని, దీంతో క్రీడా చరిత్రలో కొత్త అధ్యాయాలు లిఖించబడ్డాయి. దిగ్గజాలు జన్మించాయి..
ఇంటర్నెట్ డెస్క్: 2025 మహిళల ప్రపంచ కప్‌లో విజయం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టును ప్రపంచ టెక్ దిగ్గజాలు అభినందించారు. క్రీడల్లో ఇదొక నిర్మాణాత్మక క్షణమని అభివర్ణించారు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ 1983 ప్రపంచ కప్, 2011 ప్రపంచ కప్ విజయాలను గుర్తుకు తెచ్చిందని గూగుల్, ఆల్ఫాబెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ అన్నారు.
ఈ మేరకు గూగుల్ సీఈవో తన X ఖాతాలో ఒక పోస్ట్ లో ఏమన్నారంటే.. 'ఇది ఉల్లాసమైన మహిళల ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్. నిజంగా 1983, 2011 జ్ఞాపకాలని గుర్తుకు తెచ్చింది. టీం ఇండియాకు అభినందనలు.ఈ విజయం మొత్తం ఒక తరానికి స్ఫూర్తినిస్తుందని నేను కచ్చితంగా అనుకుంటున్నా. దక్షిణాఫ్రికాకు కూడా ఇది గొప్ప టోర్నమెంట్.' అని పిచాయ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
అటు, మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, CEO సత్య నాదెళ్ల కూడా X ఖాతాలో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. 'దీంతో క్రీడా చరిత్రలో కొత్త అధ్యాయాలు లిఖించబడ్డాయి. దిగ్గజాలు జన్మించాయి' అంటూ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. మహిళా క్రికెట్‌కు ఇది చారిత్రాత్మక రోజుని కూడా సత్య చెప్పారు. 'ఉమెన్ ఇన్ బ్లూ = ప్రపంచ ఛాంపియన్లు! తమ తొలి ఫైనల్‌కు చేరుకున్నందుకు దక్షిణాఫ్రికాకు ఇదొక మంచి గౌరవం. మహిళా క్రికెట్‌కు నిజంగా ఇది ఒక చారిత్రాత్మక రోజు - కొత్త అధ్యాయాలు వ్రాయబడ్డాయి. అడ్డంకులు బద్దలయ్యాయి. దిగ్గజాలు జన్మించాయి.' అంటూ సత్య తన హర్షాన్ని వెలిబుచ్చారు.
ఇవి కూడా చదవండి..
Infectious Diseases: భారత్‌లో పెరుగుతున్న అంటువ్యాధులు