BCCI Cash Reward: ఉమెన్ ఇన్ బ్లూకు డబ్బే.. డబ్బు. రూ. 51 కోట్ల క్యాష్ ప్రైజ్, ఇంకా ఎన్నో..
ABN , Publish Date - Nov 03 , 2025 | 08:16 AM
మహిళల ప్రపంచ కప్ విజేతగా నిలిచిన క్రికెటర్లకు BCCI భారీ నజరానా ప్రకటించింది. అటు, ఐసీసీ కూడా గత ఎడిషన్‌తో పోలిస్తే ఈసారి ప్రైజ్ మనీనీ దాదాపు మూడు రెట్లు చేసింది. ఇంకా ఎన్నో సంస్థలు భారీగా క్యాష్ రివార్డులు..
ముంబై, నవంబర్ 3: ఐసిసి మహిళల ప్రపంచ కప్ విజేతగా నిలిచిన టీం ఇండియాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)భారీ నజరానా ప్రకటించింది. దాదాపు 51 కోట్ల రూపాయలు ఇవ్వబోతోంది. ఇంతటి మొత్తాన్ని పురుషుల జట్లకు కూడా ఇప్పటివరకూ బీసీసీఐ ఇవ్వలేదు. అటు, గత ఎడిషన్‌తో పోలిస్తే ఈసారి ఐసీసీ కూడా ప్రైజ్ మనీనీ దాదాపు మూడు రెట్ల మేర పెంచింది. దీంతో, మన మహిళా క్రికెటర్లు డబ్బు పండుగ చేసుకోబోతున్నారు. ఇదే కాదు, భారత మహిళల విజయానికి ఇంకా ఎన్నో సంస్థలు భారీగా క్యాష్ రివార్డులు అందించేందుకు ముందుకు వస్తున్నాయి.
ఈ టోర్నీలో విజేత, రన్నరప్, ఇతర జట్ల కోసం మొత్తంగా ఐసీసీ 13.88 మిలియన్ డాలర్లు (రూ.123 కోట్లు) ప్రైజ్ మనీ పూల్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు, వరల్డ్ కప్ టోర్నీతో పోలిస్తే ఇది 297 శాతం ఎక్కువ. ఇక విజేతకు ఇచ్చే ప్రైజ్ మనీ కూడా గతంతో పోలిస్తే 239 శాతం మేర పెరిగింది. 2023 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన పురుష జట్టుకు ఇచ్చిన ప్రైజ్ మనీ కంటే ఇది అధికం కావడం గమనార్హం.
ఉమెన్ ఇన్ బ్లూ విక్టరీపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. '1983 లో, కపిల్ దేవ్ టీం ప్రపంచ కప్ గెలవడం ద్వారా క్రికెట్‌లో కొత్త శకాన్ని, ప్రోత్సాహాన్ని తీసుకొచ్చారు. నేటి మహిళలు కూడా అదే ఉత్సాహం, ప్రోత్సాహాన్ని అందించారు. హర్మన్‌ప్రీత్ కౌర్, ఆమె బృందం ఈ రోజు ట్రోఫీని గెలుచుకోవడమే కాదు, వారు భారతీయులందరి హృదయాలను సొంతం చేసుకున్నారు. వాళ్లు తదుపరి తరం మహిళా క్రికెటర్లకు మార్గం సుగమం చేశారు. సెమీఫైనల్లో మా జట్టు ఆస్ట్రేలియాను ఓడించినప్పుడే మా మహిళా క్రికెట్ తదుపరి స్థాయికి చేరుకుంది.'అన్నారు.
ఇవి కూడా చదవండి..
Infectious Diseases: భారత్‌లో పెరుగుతున్న అంటువ్యాధులు