IND vs SA: గువాహటిలో కొత్త సంప్రదాయం!
ABN , Publish Date - Oct 30 , 2025 | 05:57 PM
నవంబర్ 14 నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. అయితే ఈ సారి భారత్‌లో కొత్త సంప్రదాయానికి తెరలేవనుంది. గువాహటిలో ఇప్పటి నుంచి మొదట టీ బ్రేక్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత రెండో సెషన్ ముగిసిన తర్వాత లంచ్ బ్రేక్ ఇస్తారు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా(Team India)తో టెస్టు సిరీస్ కోసం సౌతాఫ్రికా భారత్‌లో పర్యటించనుంది. నవంబర్ 14 నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్టు(India vs South Africa) జరగనుంది. నవంబర్ 22 నుంచి గువాహటి(Guwahati Test) వేదికగా రెండో టెస్టులో ఇరు జట్టు తలపడనున్నాయి. అయితే ఈ సారి భారత్‌లో కొత్త సంప్రదాయానికి తెరలేవనుంది. కేవలం గువాహటిలోనే ఈ సంప్రదాయం ఆచరిస్తారా? ఆ తర్వాత జరిగే సిరీస్‌లకూ ఇదే పాటిస్తారా? అనే దానిపై స్పష్టత రాలేదు. గువాహటిలో మాత్రం మ్యాచ్ జరిగే ఐదు రోజులు కొత్త పద్ధతిని పాటించనున్నారు. ఇంతకీ అదేంటంటే..
సాధారణంగా టెస్టు మ్యాచ్ అంటే 90 ఓవర్ల పాటు ఆట సాగుతుంది. మూడు సెషన్లు ఉంటాయి. భారత్‌లో తొలి సెషన్ ముగియగానే లంచ్ బ్రేక్ ఇస్తారు. రెండో సెషన్ ముగిసిన తర్వాత టీ బ్రేక్ తీసుకుంటారు. ఇక చివరి సెషన్ ముగిస్తే ఆ రోజుకు ఆట పూర్తి అయినట్లు. అయితే గువాహటిలో మాత్రం మొదట టీ బ్రేక్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత రెండో సెషన్ ముగిసిన తర్వాత లంచ్ బ్రేక్ ఇస్తారు. దీనికి అక్కడ వాతావరణమే కారణం. త్వరగా సూర్యోదయం, సూర్యాస్తమయం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి.
సెషన్ల టైమింగ్ ఇలా..
తొలి సెషన్: 9 గంటల నుంచి 11 గంటల వరకు
టీ బ్రేక్: 11 గంటల నుంచి 11.20 గంటల వరకు
రెండో సెషన్: 11.20 గంటల నుంచి 1.20 గంటల వరకు
లంచ్ బ్రేక్: 1.20 గంటల నుంచి 2 గంటల వరకు
మూడో సెషన్: 2 గంటల నుంచి 4 గంటల వరకు
ఈ వార్తలు కూడా చదవండి..
Gold Price Today: ఇవాళ్టి మార్కెట్లో బంగారం ధరలు
Australian cricketer: విషాదం.. ఆసీస్ యువ క్రికెటర్ మృతి