Share News

Devon Conway Record: డెవాన్‌ కాన్వే అరుదైన రికార్డ్.. తొలి న్యూజిలాండ్‌ బ్యాటర్‌గా

ABN , Publish Date - Dec 21 , 2025 | 02:55 PM

మౌంట్ మాంగనుయ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో డెవాన్ కాన్వే అదరగొడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన కాన్వే.. రెండో ఇన్నింగ్స్‌లోనూ శతకం బాదాడు. దీంతో ఒకే టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ సాధించిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్‌గా కాన్వే రికార్డ్ క్రియేట్ చేశాడు.మౌంట్ మాంగనుయ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో డెవాన్ కాన్వే అదరగొడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన కాన్వే.. రెండో ఇన్నింగ్స్‌లోనూ శతకం బాదాడు. దీంతో ఒకే టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ సాధించిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్‌గా కాన్వే రికార్డ్ క్రియేట్ చేశాడు.

 Devon Conway Record: డెవాన్‌ కాన్వే అరుదైన రికార్డ్.. తొలి న్యూజిలాండ్‌ బ్యాటర్‌గా
Devon Conway Record

ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే చరిత్ర సృష్టించాడు. మౌంట్ మాంగనుయ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో డెవాన్ కాన్వే అదరగొడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన కాన్వే.. రెండో ఇన్నింగ్స్‌లోనూ శతకం బాదాడు. దీంతో ఒకే టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ సాధించిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్‌గా కాన్వే రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్పటివరకు ఏ కివీస్ ప్లేయర్ కూడా ఈ ఫీట్ సాధించలేదు. అలానే ప్రపంచ క్రికెట్‌లో ఈ ఫీట్ సాధించిన 10వ బ్యాటర్‌గా కాన్వే నిలిచాడు. విండీస్ తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కాన్వే 367 బంతుల్లో 31 ఫోర్లతో 227 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా అదే ఫామ్ తో 139 బంతుల్లో వంద పరుగులు చేశాడు. అందులో 8ఫోర్లు, 3 సిక్స్ లు ఉన్నాయి. గత రెండేళ్లుగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డ కాన్వే ఈ ఏడాది మాత్రం దుమ్ములేపాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల్లో 87.12 సగటుతో 697 పరుగులు సాధించారు.


ఇక మూడో టెస్టు విషయానికి వస్తే.. 452 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన విండీస్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి కరేబియన్ జట్టు తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. విండీస్ జట్టు విజయానికి ఇంకా 419 పరుగులు కావాలి. క్రీజులో బ్రాండెన్ కింగ్‌(37), క్యాంప్‌బెల్‌(2) ఉన్నారు. అంతకుముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ దిగింది. తొలి ఇన్నింగ్స్ లో 575 పరుగుల భారీ స్కోర్ చేసి డిక్లేర్ ఇచ్చింది. ఆ తర్వాత తమ సెకెండ్ ఇన్నిం‍గ్స్‌ను కూడా 306/2 వ‌ద్ద డిక్లేర్ చేసింది.


కివీస్ బ్యాట‌ర్లలో కాన్వేతో పాటు టామ్ లాథ‌మ్ కూడా శ‌త‌క్కొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి విండీస్‌ ముందు 452 లక్ష్యాన్ని బ్లాక్‌ క్యాప్స్‌ ఉంచింది. ఇక విండీస్‌ కూడా తమ మొదటి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా పోరాడింది. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (63), జాన్ కాంప్‌బెల్ (45) మంచి ఆరంభం ఇవ్వగా.. కవేమ్ హాడ్జ్ (123) అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 420 పరుగులకు ఆలౌట్ అయింది.


ఈ వార్తలు కూడా చదవండి..

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకు రాజ్యాంగంపై గౌరవం లేదు

చిరిగిన జీన్స్‌.. స్లీవ్‌లెస్ పై నిషేధం

Updated Date - Dec 21 , 2025 | 04:01 PM