Delhi vs Mumbai: నేటి ఢిల్లీ vs ముంబై మ్యాచుకు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దైతే ఏంటి పరిస్థితి..
ABN , Publish Date - May 21 , 2025 | 12:21 PM
ఈరోజు రాత్రి ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ (MI), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్ల మధ్య(Delhi vs Mumbai) కీలక మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలు కానుంది. కానీ ఈ మ్యాచుకు వర్షం ముప్పు పొంచి ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. ఇలాంటి క్రమంలో మ్యాచ్ జరుగుతుందా, రద్దైతే ఏంటి పరిస్థితి అనే విషయాలను ఇక్కడ చూద్దాం.

ఐపీఎల్ 2025లో భాగంగా నేడు రాత్రి 7.30 గంటలకు వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ (DC), ముంబై ఇండియన్స్ (MI) మధ్య (Delhi vs Mumbai) కీలక మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వాతావరణం ప్రధాన అడ్డంకిగా మారింది. భారీ వర్షం, ఉరుములు, తుఫాను వంటి పరిస్థితులు మ్యాచ్‌ను అడ్డుకునేలా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో నేడు సాయంత్రం ముంబైలో 2 నుంచి 4 గంటల మధ్య వర్షం పడే అవకాశం 80–90% ఉందని వెదర్ రిపోర్ట్ అంచనా వేసింది. ఈ పరిస్థితులు మ్యాచ్‌కు అడ్డంకిగా మారనున్నాయి. వర్షం అలాగే రాత్రి వరకు కొనసాగితే మ్యాచ్ రద్దయ్యే ఛాన్సుంది.
మ్యాచ్ రద్దు అయితే పరిస్థితి ఎలా ఉంటుంది
ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే, రెండు జట్లు ఒక్కో పాయింట్‌ను పంచుకుంటాయి. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది, ఢిల్లీ క్యాపిటల్స్ 13 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఈ పాయింట్ల పంచుకోవడం ద్వారా MIకి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే వారి నెట్ రన్ రేట్ DC కంటే మెరుగ్గా ఉంది. అయితే, DCకు ప్లేఆఫ్ అవకాశాలు క్షీణిస్తాయి . ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్ బెర్తును నిర్ధారించుకోవాలంటే, వారు ముంబైని ఓడించి, తమ చివరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను కూడా ఓడించాలి.
తుది నిర్ణయం
కానీ ఈ మ్యాచ్ రద్దు అయితే DCకు నెట్ రన్ రేట్ ఆధారంగా ప్లేఆఫ్ అవకాశాలు తగ్గుతాయి. చివరకు ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే ప్లేఆఫ్ రేసులో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. ముంబై ఇండియన్స్‌కు లాభం, ఢిల్లీ క్యాపిటల్స్‌కు నష్టం జరుగుతుందని చెప్పవచ్చు. అయితే, వర్షం తగ్గిపోతే కొన్ని ఓవర్ల వరకు మ్యాచ్ నిర్వహించే ఛాన్సుంది. ఆ క్రమంలో వారి స్కోర్ ఆధారంగా ఇరు జట్ల గెలుపును అంచనా వేస్తారు.
ఇరు జట్లు..
ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేస్తే ప్లేయింగ్ 11 జట్టులో ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్, దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా ఉంటారు.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేస్తే ప్లేయింగ్ 11 జట్టులో అభిషేక్ పోరెల్, ఫాఫ్ డుప్లెసిస్, కరుణ్ నాయర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్‌స్, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, ముస్తఫిజుర్ రెహ్మాన్, కుల్దీప్ యాదవ్, ముకేష్ కుమార్ కలరు.
ఇవీ చదవండి:
Loan Apps: యాప్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..
Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Bengaluru Roads: రోడ్ల అధ్వాన స్థితిపై రూ.50 లక్షల పరిహారం కోరుతూ లీగల్ నోటీస్..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి