Share News

Virat Kohli: ఒక్క చాన్స్.. సీన్ సితారే అంటున్న కోహ్లీ

ABN , Publish Date - Apr 10 , 2025 | 01:11 PM

RCB: టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఎలా దుమ్మురేపుతాడో.. ఐపీఎల్‌లోనూ అదే లెవల్‌లో రచ్చ చేస్తుంటాడు. అయితే ఒక్క చాన్స్ దొరికి ఉంటే కథ మరోలా ఉండేదని అంటున్నాడు కింగ్. అతడు ఎందుకిలా అన్నాడో ఇప్పుడు చూద్దాం..

Virat Kohli: ఒక్క చాన్స్.. సీన్ సితారే అంటున్న కోహ్లీ
Virat Kohli

ఐపీఎల్‌లో దాదాపుగా అందరు స్టార్లు కనీసం రెండు టీమ్స్‌కు ఆడారు. కానీ ఒకే జట్టుకు ఆడుతూ వచ్చిన అరుదైన ఆటగాళ్లలో కింగ్ విరాట్ కోహ్లీ ఒకడు. క్యాష్ రిచ్ లీగ్‌లోకి డెబ్యూ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మాత్రమే ఆడుతూ వస్తున్నాడు విరాట్. ఆ టీమ్ ఒక్కసారి ట్రోఫీ నెగ్గకపోయినా అతడు జట్టు మారలేదు. ఇతర టీమ్స్ నుంచి భారీ ఆఫర్లు వచ్చినా ఆర్సీబీకి స్టిక్ అయిపోయాడు కింగ్. అలాంటోడు బెంగళూరులో ఆడిన తొలినాళ్లను తాజాగా గుర్తుచేసుకున్నాడు. అప్పట్లో ఒక్క చాన్స్ ఇచ్చి ఉంటే కథ మరోలా ఉండేదని అన్నాడు. ఇంతకీ విరాట్ ఎందుకీ వ్యాఖ్యలు చేశాడనేది ఇప్పుడు చూద్దాం..


రియల్ జర్నీ స్టార్ట్స్

ఆర్సీబీ తరఫున ఆడిన తొలి 3 సీజన్లలో తనకు సరైన అవకాశాలు దక్కలేదన్నాడు కోహ్లీ. టాపార్డర్‌లో ఆడాలని ఎంతగానో అనుకున్నానని.. కానీ ఆ చాన్స్ దక్కలేదన్నాడు. లోయర్ ఆర్డర్‌లోనే తనను ఆడిస్తూ వచ్చారని తెలిపాడు. అందుకే ఆ మూడేళ్లు ఎంత ప్రయత్నించినా ఐపీఎల్‌లో తన ముద్ర వేయలేకపోయానని వాపోయాడు కింగ్. 2011 నుంచి పరిస్థితులు మారిపోయాయని.. ఆ ఏడాది నుంచి తాను 3వ నంబర్‌లో బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టానని పేర్కొన్నాడు కోహ్లీ. అప్పటి నుంచి రియల్ ఐపీఎల్ జర్నీ స్టార్ట్ అయిందని.. మళ్లీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదన్నాడు.


కథ మరోలా ఉండేది

ఐపీఎల్‌కు ఆడిన కొత్తలో గనుక టాపార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగే చాన్స్ వచ్చి ఉంటే సిచ్యువేషన్ మరోలా ఉండేదన్నాడు కోహ్లీ. క్యాష్ రిచ్ లీగ్‌పై మొదట్లోనే తన మార్క్ వేసేవాడ్ని అని.. సీన్ సితార్ అయి ఉండేదన్నాడు. అయితే గుర్తింపు రావడానికి, బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ దక్కేందుకు కొంత టైమ్ పట్టిందన్నాడు కింగ్. మరో విషయం మీదా అతడు రియాక్ట్ అయ్యాడు. ఈగో వల్లే తాను ఇంతగా సక్సెస్ అవుతున్నాననే వ్యాఖ్యలు సరికాదన్నాడు. ఈగోను తాను పట్టించుకోనని స్పష్టం చేశాడు. క్రీజులో ఉన్న ఇతర బ్యాటర్లు మంచి రిథమ్‌లో ఉంటే వాళ్లకు స్ట్రైక్ రొటేషన్ ఇస్తుంటానని.. ఒకవేళ తాను టచ్‌లో ఉంటే చార్జ్ తీసుకొని దాడి చేస్తానని చెప్పుకొచ్చాడు విరాట్.


ఇవీ చదవండి:

కొత్త కాంట్రవర్సీలో టీమిండియా స్టార్

రండి చూస్కుందాం.. గిల్ వార్నింగ్

ఒలింపిక్స్‌లో క్రికెట్‌.. ఆ జట్లకే చాన్స్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 10 , 2025 | 01:11 PM