Share News

SRH vs PBKS Prediction: సన్‌రైజర్స్ వర్సెస్ పంజాబ్.. గెలుపు దాహం తీరేనా..

ABN , Publish Date - Apr 12 , 2025 | 04:32 PM

Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక సమరానికి సిద్ధమవుతోంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో పంజాబ్ కింగ్స్‌తో ఇవాళ తాడోపేడో తేల్చుకోనుంది కమిన్స్ సేన.

SRH vs PBKS Prediction: సన్‌రైజర్స్ వర్సెస్ పంజాబ్.. గెలుపు దాహం తీరేనా..
SRH vs PBKS

ఐపీఎల్-2025లో వరుస పరాభవాలతో డీలాపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. తిరిగి పంజా విసరాలని చూస్తోంది. సక్సెస్ ట్రాక్ ఎక్కి ప్లేఆఫ్స్ రేసులో దూసుకుపోవాలని చూస్తోంది. అందుకు పంజాబ్ కింగ్స్‌తో ఉప్పల్ వేదికగా ఇవాళ జరగబోయే మ్యాచ్‌ను వాడుకోవాలని చూస్తోంది. పంజాబ్‌ను చిత్తుగా ఓడించి కమ్‌బ్యాక్‌ను గ్రాండ్‌గా చాటాలని భావిస్తోంది. అటు మంచి జోష్‌లో ఉన్న అయ్యర్ సేన.. ఎస్‌ఆర్‌హెచ్ మీద నెగ్గి తిరిగి టేబుల్ టాపర్ అవ్వాలని పంతంతో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..


బలాలు

సన్‌రైజర్స్: ఈ జట్టులో తోపు బ్యాటర్లు ఉన్నారు. అభిషేక్ శర్మ నుంచి అనికేత్ వర్మ వరకు.. హెడ్ నుంచి క్లాసెన్ దాకా పవర్‌ఫుల్ హిట్టర్లు ఉన్నారు. వీళ్లలో ఏ ముగ్గురు క్లిక్ అయినా భారీ స్కోరు ఖాయం. బౌలింగ్‌లో షమి తిరిగి ఫామ్ అందుకోవడం బిగ్ ప్లస్.

పంజాబ్: బ్యాటింగ్ ఈ జట్టు ప్రధాన బలం. బ్యాటింగ్‌లో ప్రియాన్ష్ ఆర్య గత మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టాడు. శశాంక్ సింగ్ నెక్స్ట్ లెవల్ హిట్టింగ్‌తో దుమ్మురేపుతున్నాడు. అయ్యర్, స్టొయినిస్, వధేరా కూడా అవకాశం వస్తే ప్రత్యర్థిని చీల్చి చెండాడాలని ఎదురు చూస్తున్నారు. బౌలింగ్‌లో ఫెర్గూసన్, అర్ష్‌దీప్, చాహల్ రాణిస్తున్నారు.


బలహీనతలు

సన్‌రైజర్స్: సూపర్బ్ బ్యాటర్లు స్క్వాడ్‌లో ఉన్నా ఏ ఒక్కరూ ఫుల్ స్వింగ్‌లో ఆడట్లేదు. నితీష్ రెడ్డి, క్లాసెన్, హెడ్, అభిషేక్.. ఇలా అందరూ టచ్ కోల్పోయారు. అటు బౌలింగ్‌లో కెప్టెన్ కమిన్స్ ఆశించిన మేర రాణించడం లేదు. సిమర్జీత్, అభిషేక్ భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు.

పంజాబ్: స్టొయినిస్, మాక్స్‌వెల్ బ్యాట్ నుంచి ఇప్పటిదాకా భారీ నాక్స్ రాలేదు. ఒకవేళ అయ్యర్ ఔట్ అయితే.. వీళ్లు టీమ్‌ను భారీ స్కోరు దిశగా తీసుకెళ్తారా అనేది అనుమానమే. బౌలింగ్‌లో కలసికట్టుగా రాణిస్తున్నా ప్రత్యర్థి బ్యాటర్లు విరుచుకుపడితే మాత్రం చేతులెత్తేస్తున్నారు.


హెడ్ టు హెడ్

ఈ రెండు జట్ల మధ్య ఇప్పటిదాకా 23 మ్యాచులు జరిగాయి. ఇందులో 16 మ్యాచుల్లో సన్‌రైజర్స్, 7 మ్యాచుల్లో పంజాబ్ విజయం సాధించాయి.

ప్రిడిక్షన్

రికార్డుల పరంగా సన్‌రైజర్స్‌ది పైచేయిగా ఉన్నా.. ఫామ్ పరంగా పంజాబ్ చాలా ముందుంది. ఎస్‌ఆర్‌హెచ్ వరుస ఓటములతో నిరాశలో కూరుకుపోయింది. అటు అయ్యర్ సేన మంచి జోష్‌లో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా కూడా సన్‌రైజర్స్ కంటే ఆ టీమ్ ఫామ్‌లో ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చూస్తే.. ఇవాళ్టి మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించడం ఖాయం.


ఇవీ చదవండి:

జీటీకి షాక్.. తోపు ప్లేయర్ దూరం

తప్పు ధోనీది కాదు.. వాళ్లదే

పతిరానా కాళ్లు మొక్కిన బ్రావో

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 12 , 2025 | 04:36 PM