Share News

SRH vs MI: చేతికి నల్లరిబ్బన్లతో బరిలోకి.. ప్లేయర్లు ఎందుకిలా చేస్తున్నారంటే..

ABN , Publish Date - Apr 23 , 2025 | 02:12 PM

Today IPL Match: సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మ్యాచ్‌కు మరికొన్ని గంటల సమయమే మిగిలి ఉంది. అయితే ఇవాళ్టి మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లతో పాటు అంపైర్లు కూడా చేతికి నల్లబ్యాండ్లతో బరిలోకి దిగనున్నారు. దీని వెనుక కారణం ఏంటంటే..

SRH vs MI: చేతికి నల్లరిబ్బన్లతో బరిలోకి.. ప్లేయర్లు ఎందుకిలా చేస్తున్నారంటే..
SRH vs MI

సన్‌రైజర్స్ హైదరాబాద్ చావోరేవో తేల్చుకునేందకు సిద్ధమవుతోంది. వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్‌ రేసులో వెనుకబడిన కమిన్స్ సేన.. ఇవాళ సొంతగడ్డపై ముంబై ఇండియన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌తో పాటు ఇక మీదట ఆడే ప్రతి పోరులోనూ నెగ్గితేనే ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. కాబట్టి అలసత్వానికి తావివ్వకుండా తమ బెస్ట్ పెర్ఫార్మెన్స్‌తో ఇరగదీయాల్సి ఉంటుంది. ఈ తరుణంలో సవాల్‌కు సిద్ధమవుతున్న సన్‌రైజర్స్‌తో పాటు విన్నింగ్ స్ట్రీక్‌ను కంటిన్యూ చేయాలని అనుకుంటున్న ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు కూడా ఉప్పల్‌లో బరిలోకి దిగనున్నారు. అయితే ఇరు జట్ల ప్లేయర్లతో పాటు అంపైర్లు కూడా చేతికి నల్లరిబ్బన్లు కట్టుకొని గ్రౌండ్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం..


చీర్‌లీడర్స్ చిందులూ బంద్

కశ్మీర్‌లోని పహెల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడి 22/4 మృతులకు సంఘీభావంగా ఉప్పల్ మ్యాచ్‌లో ఆటగాళ్లంతా బ్లాక్ కలర్ ఆర్మ్ బ్యాండ్స్‌తో బరిలోకి దిగనున్నారు. మృతులకు నివాళులు అర్పించి 1 నిమిషం పాటు మౌనం పాటించనున్నారు. దేశాన్ని ఉలిక్కి పడేలా చేసిన ఈ ఘటన నేపథ్యంలో అన్ని మ్యాచుల్లా కాకుండా సన్‌రైజర్స్-ముంబై పోరును ఎలాంటి హంగూ ఆర్భాటాల్లేకుండా సాదాసీదాగా నిర్వహించాలని బీసీసీఐ డిసైడ్ అయింది. మ్యాచ్‌లో టపాసులను కూడా వాడటం లేదు. అలాగే చీర్‌లీడర్స్ చిందుల్ని కూడా నిలిపివేశారు. సో, ఈ మ్యాచ్‌ను చాలా సింపుల్‌గా జరపనుంది బీసీసీఐ. కాగా, వరుస ఓటములతో పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో ఉన్న కమిన్స్ సేన.. ఇవాళ్టి మ్యాచ్‌తో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


ఇవీ చదవండి:

పెళ్లి కాని మిశ్రా భార్యను వేధించాడట

బుమ్రా మంధానకు విజ్డెన్‌ అవార్డులు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 23 , 2025 | 02:16 PM