RCB: వార్నీ 42 కోట్లా.. ఆర్సీబీ డామినేషన్.. ప్రతి రోజూ పండగే
ABN , Publish Date - Apr 09 , 2025 | 04:22 PM
IPL Viewership Numbers: ఆర్సీబీ.. ఆర్సీబీ.. ఇప్పుడే ఇదే నామజపం చేస్తోంది జియో హాట్‌స్టార్. ఎందుకంటే ఆ టీమ్ ఆడే మ్యాచులకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. ఈ సీజన్‌లో కోహ్లీ టీమ్ ఆడే మ్యాచులకు వ్యూస్ ఎలా ఉన్నాయి.. హయ్యెస్ట్ వ్యూయర్‌షిప్ ఏ మ్యాచ్‌కు వచ్చిందో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో ఆర్సీబీ హవా నడుస్తోంది. ఎప్పుడూ పడుతూ లేస్తూ పోయే ఈ జట్టు.. ప్లేఆఫ్స్‌కు చేరుకుంటే గొప్ప అనేలా పరిస్థితి ఉండేది. ఒకవేళ ప్లేఆఫ్స్‌కు చేరుకున్నా అక్కడి నుంచి ముందుకు వెళ్లడం కష్టసాధ్యమే. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ట్రోఫీని అందుకోలేదు కోహ్లీ టీమ్. అయితే ఈసారి వరుస విజయాలతో హోరెత్తిస్తోంది బెంగళూరు. ఇప్పటిదాకా ఆడిన 4 మ్యాచుల్లో 3 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలో కొనసాగుతోంది ఆర్సీబీ. అలాంటి టీమ్ వ్యూయర్‌షిప్‌లోనూ దుమ్మురేపుతోంది. 42 కోట్ల మార్క్‌ను ఉఫ్‌మని ఊదిపారేసింది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
అస్సలు తగ్గేదేలే
ఈ ఐపీఎల్‌లో ఆర్సీబీ పట్టిందల్లా బంగారం అవుతోంది. తమకు ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్‌తో కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ టీమ్‌ను అద్భుతంగా నడిపిస్తున్నాడు. ఆ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. దీంతో ఆర్సీబీ మ్యాచుల కోసం భారీగా ఎగబడుతున్నారు ఆడియెన్స్. ఈ సీజన్‌లో ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్‌కు ఏకంగా 41.7 కోట్ల వ్యూస్ వచ్చాయి. అదే ఆర్సీబీ-సీఎస్‌కే మ్యాచ్‌కు 37.4 కోట్లు, ఆర్సీబీ-ఎంఐ మ్యాచ్‌కు 34.7 కోట్ల వ్యూస్ వచ్చాయి. మరే టీమ్ ఆడినా ఇన్ని వ్యూస్ రాకపోవడం గమనార్హం.
కొత్త రికార్డులు ఖాయం
ఆర్సీబీ మ్యాచ్ అంటే చాలు క్రికెట్ లవర్స్ టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతున్నారు. అందుకే ఆ టీమ్ మ్యాచులకు కనీసం 35 కోట్లకు మించే వ్యూస్ వస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ఈ సీజన్ ఎండింగ్‌కు వ్యూయర్‌షిప్ విషయంలో బెంగళూరు కొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. బెంగళూరు మ్యాచులతో బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ జియో హాట్‌స్టార్ పండుగ చేసుకుంటోంది. దీనిపై ఆర్సీబీ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీమ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, సక్సెస్ రేట్, కోహ్లీ క్రేజ్, ప్లేయర్ల పెర్ఫార్మెన్స్ వల్లే రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయని చెబుతున్నారు. ఆర్సీబీ మ్యాచులకు వస్తున్న వ్యూస్ ఇతర మ్యాచెస్ మీదా సానుకూల ప్రభావం చూపిస్తోందని.. దీంతో జియోకు ప్రతి రోజూ పండుగలా మారిందని అంటున్నారు.
ఇవీ చదవండి:
సన్‌రైజర్స్ ఆశలన్నీ హనుమయ్య మీదే..
11 క్యాచులు మిస్.. ఈ టీమ్ అస్సాంకే..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి