Share News

Karun Nair: నన్ను రిటైర్ అవ్వమన్నాడు.. కరుణ్ నాయర్ సంచలన వ్యాఖ్యలు!

ABN , Publish Date - Jun 16 , 2025 | 02:51 PM

టీమిండియా వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ స్టార్ క్రికెటర్ తనను రిటైర్ అవ్వమన్నాడని తెలిపాడు. మరి.. నాయర్‌ను వైదొలగమని చెప్పిన ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

Karun Nair: నన్ను రిటైర్ అవ్వమన్నాడు.. కరుణ్ నాయర్ సంచలన వ్యాఖ్యలు!
Karun Nair

భారత జట్టులో చోటు దక్కించుకోవడం కంటే కూడా రీఎంట్రీ ఇవ్వడం చాలా కష్టం. ఎందుకంటే ఎక్కువగా విఫలమైన ఆటగాళ్లే జట్టుకు దూరమవుతారు. వాళ్ల మీద ఫెయిల్యూర్ స్టాంప్ పడిపోతుంది. అలాంటి వాళ్లు తిరిగి టీమిండియాలోకి కమ్‌బ్యాక్ ఇవ్వడం అంత ఈజీ కాదు. బెస్ట్ పెర్ఫార్మెన్స్‌లు ఇస్తూ చాన్నాళ్ల పాటు వేచిచూడక తప్పదు. తీవ్రపోటీని తట్టుకొని అద్భుతంగా రాణించగలగాలి. దీనికి తోడు అదృష్టం కూడా తోడవ్వాలి లేదంటే రీఎంట్రీ కష్టమే. వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ విషయంలోనూ ఇదే జరిగింది. ట్రిపుల్ సెంచరీ కొట్టాక టీమిండియాకు దూరమైన అతడు.. ఎట్టకేలకు 8 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌ సిరీస్‌తో కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ తరుణంలో ఓ భారత స్టార్ తనను రిటైర్ అవ్వమన్నాడంటూ అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

karun.jpg


డబ్బుల కోసం..

‘ఓ టీమిండియా క్రికెటర్ నన్ను పిలిచాడు. నువ్వు రిటైర్ అయిపో అని సలహా ఇచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా అనేక క్రికెట్ లీగ్స్ జరుగుతున్నాయి. కాబట్టి రిటైర్ అయ్యాక వాటిల్లో ఆడితే నీకు బాగా డబ్బు వస్తుందని సూచించాడు’ అని కరుణ్ నాయర్ రివీల్ చేశాడు. ఆ క్రికెటర్ సలహా విని రిటైర్‌మెంట్ తీసుకోవడం పెద్ద విషయం కాదని.. కానీ తనకు డబ్బుల కంటే సవాళ్లను ఎదుర్కోవడమే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఎప్పటికైనా భారత జట్టుకు తిరిగి ఆడాలనే కోరికతోనే ఇన్నాళ్లూ దేశవాళీ క్రికెట్‌లో కొనసాగానని నాయర్ పేర్కొన్నాడు.


ఎవరా స్టార్?

రీఎంట్రీ ఇస్తాననే నమ్మకం తనకు ఉందని.. అందుకోసం తీవ్రంగా శ్రమించానని కరుణ్ నాయర్ తెలిపాడు. కష్టం వృథా పోలేదని, తాను అనుకున్నట్లే తిరిగి రీఎంట్రీ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. కాగా, ఆ క్రికెటర్ తనను రిటైర్ అవ్వమన్నాడంటూ కరుణ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే అతడు పేరు బయటపెట్టకపోవడంతో నాయర్‌ను రిటైర్ అవ్వమని చెప్పిన ఆ భారత స్టార్ ఎవరై ఉంటారా? అని నెటిజన్స్ ఆలోచనల్లో పడ్డారు.


ఇవీ చదవండి:

ఆ రోజునే ఇండో-పాక్ ఫైట్

కూతుర్ని పెళ్లి చేసుకోమని కోహ్లీని అడిగా

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 16 , 2025 | 02:53 PM