Share News

Virat Kohli: నా కుమార్తెను పెళ్లి చేసుకోమని కోహ్లీని అడిగాను.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ టేలర్

ABN , Publish Date - Jun 16 , 2025 | 01:42 PM

టీమిండియా స్టార్ బ్యాటర్, కింగ్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. కోహ్లీ ఆటతీరును, దూకుడైన స్వభావాన్ని చాలా మంది ఇష్టపడుతుంటారు. కోహ్లీ ఫ్యాన్స్‌లో సాధారణ వ్యక్తులే కాదు.. మాజీ క్రికెటర్లు కూడా ఉన్నారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ కూడా కోహ్లీకి వీరాభిమాని.

Virat Kohli: నా కుమార్తెను పెళ్లి చేసుకోమని కోహ్లీని అడిగాను.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ టేలర్
Mark taylor asked virat kohli to marry his daughter

టీమిండియా స్టార్ బ్యాటర్, కింగ్ కోహ్లీకి (Virat Kohli) ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. కోహ్లీ ఆటతీరును, దూకుడైన స్వభావాన్ని చాలా మంది ఇష్టపడుతుంటారు. కోహ్లీ ఫ్యాన్స్‌లో సాధారణ వ్యక్తులే కాదు.. మాజీ క్రికెటర్లు కూడా ఉన్నారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ (Mark Taylor) కూడా కోహ్లీకి వీరాభిమాని. ఎంత అభిమానం అంటే తన కూతురిని కోహ్లీకి ఇచ్చి పెళ్లి చేయాలని కూడా టేలర్ అనుకున్నాడట. ఆ విషయాన్ని తాజాగా మార్క్ టేలర్ వెల్లడించాడు. గతంలో కోహ్లీతో తనకెదురైన అనుభవాన్ని పంచుకున్నాడు.


'టీమిండియాకు కోహ్లీ కెప్టెన్ అయిన తొలి రోజుల్లో కోహ్లీని నేను కలుసుకున్నాను. అడిలైడ్ ఓవల్‌లో అతడిని ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు వచ్చింది. ఒక అరగంట మాత్రమే కోహ్లీ నాకు టైమ్ కేటాయించాడు. అరగంట తర్వాత మేనేజర్ వచ్చి కోహ్లీని తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అప్పుడు కోహ్లీ.. 'మిస్టర్ టేలర్.. మీరు అడగాల్సిన ప్రశ్నలు అయిపోయాయా' అని అడిగాడు. నేను 'లేదు' అని సమాధానం ఇచ్చా. అప్పుడు కోహ్లీ నా మీద గౌరవం కొద్దీ మరింత సమయం కేటాయించాడ'ని టేలర్ చెప్పాడు.


కోహ్లీ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో, బయట అంత వినయ, విధేయతలతో ఉంటాడని మార్క్ టేలర్ వెల్లడించాడు. ఒక గొప్ప ఆటగాడిలో ఉండాల్సిన లక్షణాలన్నీ కోహ్లీలో ఉన్నాయని టేలర్ చెప్పాడు. ఆ సమయంలో తన కూతురిని కోహ్లీకి పరిచయం చేశానని, నీకు ఇష్టమైతే నా కూతురిని వివాహం చేసుకోవచ్చని సరదాగా అన్నానని టేలర్ చెప్పాడు. అప్పటికి కోహ్లీకి ఇంకా వివాహం కాలేదని, తన కూతురికి 17 సంవత్సరాలని చెప్పాడు. అతడి వ్యక్తిత్వం నచ్చడంతోనే తాను అలా సరదాగా అన్నానని మార్క్ టేలర్ చెప్పాడు.


ఇవీ చదవండి:

AB de Villiers: ఆ జట్టు నిండా విషపూరిత వ్యక్తులే.. ఐపీఎల్ జట్టుపై డివిల్లీర్స్ సంచలన కామెంట్స్

వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకోండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 16 , 2025 | 01:42 PM