Sarfaraz Khan: సర్ఫరాజ్ స్టన్నింగ్ క్యాచ్.. ఏం పట్టాడు భయ్యా!
ABN , Publish Date - Jun 01 , 2025 | 09:31 PM
టాలెంటెడ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఫీల్డింగ్‌లో అదరగొట్టాడు. స్టన్నింగ్ క్యాచ్‌తో వారెవ్వా అనిపించాడు. తనకు వ్యతిరేక దిశలో వెళ్తున్న బంతిని అద్భుతంగా ఒడిసిపట్టాడు.
టీమిండియా యంగ్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ ఎప్పుడూ బ్యాట్‌తో మెరుస్తుంటాడు. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన సర్ఫరాజ్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌లోనూ సత్తా చాటాడు. భారత జట్టు తరఫున ఆడిన తొలి సిరీస్‌లోనే బాగా పెర్ఫార్మ్ చేశాడు. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో వరుసగా మంచి నాక్స్ ఆడి తనలోని ప్రతిభను ప్రపంచానికి చాటాడు. టెస్టుల్లో సుదీర్ఘ కాలం టీమిండియాకు ఆడగలనని నిరూపించాడు. అయితే ఈ మధ్య ఫామ్ కోల్పోవడంతో అతడ్ని ఇంగ్లండ్ టూర్‌కు ఎంపిక చేసిన ప్రధాన జట్టులోకి తీసుకోలేదు. కానీ ఇండియా-ఏ టీమ్‌కు మాత్రం ఎంపిక చేశారు. ఆ టీమ్ తరఫున సర్ఫరాజ్ అదరగొడుతున్నాడు. బ్యాట్‌తో రాణిస్తూనే.. ఫీల్డింగ్‌లోనూ దుమ్మురేపుతున్నాడు. అతడు పట్టిన ఓ క్యాచ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి..
ఇంగ్లండ్ లయన్స్‌తో మ్యాచ్‌లో కళ్లుచెదిరే రీతిలో ఓ క్యాచ్‌ను అందుకున్నాడు సర్ఫరాజ్ ఖాన్. ప్రత్యర్థి బ్యాటర్ ఎమిలియో (46) కొట్టిన బంతి స్లిప్స్‌లోకి వేగంగా వెళ్లింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన సర్ఫరాజ్.. ఎడమ వైపునకు అద్భుతంగా దూకి క్యాచ్‌ను అందుకున్నాడు. బంతిని అందుకునే సమయంలో అతడి శరీరం గాల్లోనే ఉంది. క్యాచ్ అందుకున్నా సేఫ్‌గా ల్యాండ్ అయిన సర్ఫరాజ్.. బంతిని గట్టిగా పట్టుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ బ్యాటర్‌తో పాటు భారత ఆటగాళ్లూ షాక్ అయ్యారు. భలే పట్టాడంటూ ఆశ్చర్యానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సర్ఫరాజ్ క్యాచ్ చూసిన నెటిజన్స్.. ఏం పట్టాడు భయ్యా అంటూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. రైటాండ్ ప్లేయర్ అయి ఉండి ఎడమ వైపునకు ఈ రేంజ్‌లో డైవ్ చేసి క్యాచ్ అందుకోవడం హైలైట్ అని మెచ్చుకుంటున్నారు. కాగా, ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 92 పరుగులతో మెరిశాడు సర్ఫరాజ్.
ఇవీ చదవండి:
బుడతడి ప్రశ్న.. రోహిత్ ఆన్సర్ ఇదే..
స్పిన్ మాంత్రికుడు వస్తున్నాడు
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి