Share News

Harmanpreet Kaur: హర్మన్ ఆస్తులు ఎంతో తెలుసా?

ABN , Publish Date - Nov 03 , 2025 | 07:17 PM

భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ తన 36 ఏళ్ల వయస్సులో వన్డే ప్రపంచ కప్‌ను అందుకుంది. హర్మన్ నాయకత్వంలో సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించింది. అయితే మైదానంలో పరుగుల వర్షం కురిపించే హర్మన్.. సంపాదనలోనూ రూ.కోట్లు పోగేస్తుంది.

Harmanpreet Kaur: హర్మన్ ఆస్తులు ఎంతో తెలుసా?
Harmanpreet Kaur

ఇంటర్నెట్ డెస్క్: భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ తన 36 ఏళ్ల వయస్సులో వన్డే ప్రపంచ కప్‌ను అందుకుంది. హర్మన్ నాయకత్వంలో సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించింది. అయితే మైదానంలో పరుగుల వర్షం కురిపించే హర్మన్(Harmanpreet Kaur).. సంపాదనలోనూ రూ.కోట్లు పోగేస్తుంది.


భారీ జీతం..

2024-2025లో హర్మన్ నికర విలువ దాదాపు రూ.25కోట్లు ఉంటుందని అంచనా. ఈ భారీ ఆదాయం కేవలం క్రికెట్ మ్యాచ్‌ల నుంచి మాత్రమే కాకుండా ఎండార్స్‌మెంట్‌లు, బ్రాండ్ ఒప్పందాలు, లీగ్ క్రికెట్ నుంచి కూడా వస్తుంది. హర్మన్ బీసీసీఐ (BCCI)లో అత్యున్నతమైన గ్రేడ్ ఏ ప్లేయర్‌గా ఉంది. ఈ విభాగంలో ఆటగాళ్లకు సంవత్సరానికి రూ.50లక్షల స్థిర జీతం అందుతుంది. దాంతో పాటు, టెస్ట్ మ్యాచ్‌కు రూ.15లక్షలు, వన్డే మ్యాచ్‌కు రూ.6లక్షలు, టీ20 మ్యాచ్‌కు రూ.3లక్షలు తీసుకుంటుంది.


డబ్ల్యూపీఎల్ నుంచి రూ.కోట్లు

హర్మన్‌ప్రీత్ కౌర్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌(WPL)లో ముంబై ఇండియన్స్(MI) కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ లీగ్ నుంచి ఆమె ప్రతి సీజన్‌కు సుమారు రూ.1.80 కోట్లు అందుకుంటుంది. విదేశీ లీగ్‌లు, ఎగ్జిబిషన్ మ్యాచ్‌లలో ఆడటం ద్వారా ఆమె అదనపు ఆదాయాన్ని కూడా పొందుతూ దేశంలో అత్యధిక పారితోషికం పొందే మహిళా క్రికెటర్లలో ఒకరిగా నిలిచింది.

హర్మన్‌ప్రీత్ ఎన్నో బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, పూమా, బూస్ట్, టాటా సఫారీ, CEAT, ఏషియన్ పెయింట్స్ సహా పలు ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి. ఆమె ఒక్కో బ్రాండ్ డీల్‌కు సుమారు రూ.10-12 లక్షల సంపాదిస్తుంది. ఈ బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా ఆమె మొత్తం వార్షిక ఆదాయం సుమారు రూ.40-50 లక్షల వరకు ఉంటుంది.


లగ్జరీ ఇళ్ళు.. కార్లు

హర్మన్‌ప్రీత్‌కు ముంబై, పంజాబ్‌లోని పాటియాలాలో విలాసవంతమైన ఇళ్లు ఉన్నాయి. అలాగే ఆమెకు వింటేజ్ జీప్‌లతో పాటు హార్లే-డేవిడ్సన్ బైక్‌లు వంటి ఖరీదైన వాహనాల కలెక్షన్ కూడా ఉంది. పాటియాలాలోని ఆమె బంగ్లాను ‘హర్మన్‌ప్రీత్ కౌర్ పాటియాలా హౌస్’ అని పిలుస్తారు. మైదానంలో ఆటతో దేశం మనసు గెలిచిన హర్మన్‌ప్రీత్, ఆర్థికంగానూ యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Women's cricket team: మహిళా జట్టుకు డైమండ్ నెక్లెస్‌లు.. సూరత్ వ్యాపారి భారీ బహుమతులు..

City of Dreams: సిటీ ఆఫ్ డ్రీమ్స్.. ముంబై!

Updated Date - Nov 03 , 2025 | 07:17 PM