Share News

City of Dreams: సిటీ ఆఫ్ డ్రీమ్స్.. ముంబై!

ABN , Publish Date - Nov 03 , 2025 | 07:11 PM

క్రికెట్ చరిత్రలో ముంబై వేదికగా ఎన్నో చారిత్రాత్మకమైన ఘట్టాలు చోటు చేసుకున్నాయి. 2011 ప్రపంచ కప్ నుంచి ఆదివారం జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ వరకు ఎన్నో మరువలేని జ్ఞాపకాలు, గుర్తులు ఉన్నాయి.

City of Dreams: సిటీ ఆఫ్ డ్రీమ్స్.. ముంబై!
City of Dreams Mumbai

ఇంటర్నెట్ డెస్క్: సిటీ ఆఫ్ డ్రీమ్స్.. ముంబై నగరాన్ని ముద్దుగా పిలుచుకునే పేరిది. ఏ రంగంలో అయినా కలల ప్రపంచాన్ని కళ్ల ముందు ఉంచుతుందనే పేరు ఈ నగరానికి(City of Dreams) ఉంది. అయితే.. ఆదివారం జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ జరిగింది కూడా ముంబైలోనే. ముంబై అంటే మాయ. అక్కడ మైదానం.. మహాసంగ్రామం. అక్కడ ఆడితే చరిత్ర సృష్టించాల్సిందే. మన అమ్మాయిలు ముంబైలో చేసింది అదే!


జట్టు మొత్తం కసితో పోరాడితే…

వరల్డ్ కప్ గెలవడంతో ముంబై కూడా స్పందించింది. స్టేడియం మొత్తం భారత జెండాలతో గర్జించింది. అక్కడే మన అమ్మాయిలు మొదటిసారి వన్డే ప్రపంచకప్‌(India Women World Cup 2025)ను ముద్దాడారు. ఇక్కడ కలలు మాయం అవ్వవు.. నిజం అవుతాయని మరోసారి రుజువైంది. అందుకే ముంబై సిటీ ఆఫ్ డ్రీమ్స్ అయింది. ఈ నేపథ్యంలో ముంబైలో నెలకొల్పిన గత రికార్డుల జాబితాను చూస్తే..


ముంబైలో మరువలేని జ్ఞాపకాలు..

* ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2011 వాంఖడే(Wankhede Stadium) స్టేడియం వేదికగా ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి భారత్ తన రెండో వన్డే ప్రపంచ కప్ టైటిల్‌ను తమ సొంత గడ్డపై గెలుచుకుంది.

* క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వాంఖడే మైదానంలోనే 2013లో తన అంతర్జాతీయ టెస్ట్ కెరీర్‌(Sachin farewell)ను ముగించాడు.

* భారత మాజీ స్టార్ ఆటగాడు సునీల్ గావస్కర్(Sunil Gavaskar) 1987లో ఇక్కడే టెస్ట్ క్రికెట్‌లో 10వేల పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.

* 2016లో ఇంగ్లాండ్‌పై జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించి, సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ (235 పరుగులు) సాధించాడు. ఇది వాంఖడేలో ఒక భారత బ్యాటర్ చేసిన అత్యధిక వ్యక్తిగత టెస్ట్ స్కోరు.

* వాంఖడేలో భారత్ చేసిన అత్యధిక T20I స్కోరు 240/3 (వెస్టిండీస్‌పై, 2019). ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. దీంతోపాటు ఇక్కడ జరిగిన T20I మ్యాచ్‌లలో వేగవంతమైన సెంచరీ సాధించిన భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ ఒకరు.


డీవై పాటిల్ స్టేడియంలో రికార్డులు

* 2023లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ప్రారంభ సీజన్ ఫైనల్ డీవై పాటిల్ స్టేడియంలో జరిగింది. ఇందులో ముంబై ఇండియన్స్ జట్టు గెలిచింది. ఈ మైదానం భారత మహిళల క్రికెట్‌కు ఒక కొత్త అధ్యాయానికి వేదికైంది.

* భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ కౌర్ నవీ ముంబైలో 49 బంతుల్లో 95 పరుగులు చేసి అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును చేరుకున్నారు.

* ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం కూడా మహిళల అంతర్జాతీయ మ్యాచ్‌లకు ముఖ్య వేదిక. ఇక్కడ జరిగిన కొన్ని కీలకమైన సిరీస్‌లలో భారత్ విజయం సాధించింది. ముఖ్యంగా, మిథాలీ రాజ్ కెప్టెన్సీలో వన్డే సిరీస్‌లలో ఘన విజయాలు ఇక్కడ నమోదయ్యాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

Laura Wolvaardt: షెఫాలీ బౌలింగ్‌కు షాకయ్యాం: లారా

Shree Charani: ప్రపంచ కప్‌లో కడప బిడ్డ!

Updated Date - Nov 03 , 2025 | 07:27 PM