Share News

CSK vs PBKS Playing 11: పంజాబ్‌ను ముంచేందుకు సీఎస్‌కే ప్లాన్.. ప్లేయింగ్ 11తో అటాక్

ABN , Publish Date - Apr 30 , 2025 | 06:00 PM

IPL 2025: వరుస ఓటములతో ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్ కీలక పోరుకు సిద్ధమవుతోంది. పంజాబ్ కింగ్స్‌తో చెపాక్‌లో తలపడనుంది ధోని సేన. ఇందులో పంజాబ్‌కు షాక్ ఇవ్వాలని చూస్తోంది ఎల్లో ఆర్మీ.

CSK vs PBKS Playing 11: పంజాబ్‌ను ముంచేందుకు సీఎస్‌కే ప్లాన్.. ప్లేయింగ్ 11తో అటాక్
CSK vs PBKS Playing 11

నిండా మునిగినోడికి చలి ఏంటి.. అనేలా ఉంది చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ పరిస్థితి. ఇప్పటిదాకా ఆడిన 9 మ్యాచుల్లో 7 ఓటములతో ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది సీఎస్‌కే. నెక్స్ట్ ఆడే 5 మ్యాచుల్లో గెలిచినా ఆ టీమ్ ప్లేఆఫ్స్ చేరే అవకాశాల్లేవు. ఈ నేపథ్యంలో ఇక నుంచి జరిగే మ్యాచుల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రత్యర్థుల బెండు తీయాలని చూస్తోంది ధోని సేన. నెక్స్ట్ సీజన్ కోసం తమ టీమ్‌ను సెట్ చేసుకోవాలని భావిస్తోంది. యంగ్‌స్టర్స్‌తో ధనాధన్ ఫార్ములాతో ఆడించాలని చూస్తోంది. అందుకే చెపాక్ పిచ్‌పై చెన్నైతో మ్యాచ్ అంటే పంజాబ్ కింగ్స్‌లో ఫియర్ స్టార్ట్ అయింది. ఈ రెండు జట్ల మధ్య ఇవాళ కీలక పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో ప్లేయింగ్ 11 ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..


యువరక్తంతో జోష్..

వరుస ఓటములతో చెపాక్‌ కోట కూలుతోంది. కానీ సీఎస్‌కేను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఒక్క ఇన్నింగ్స్, ఒక్క మంచి స్పెల్ చాలు.. ప్రత్యర్థిని పోయించడానికి అనే కాన్ఫిడెన్స్‌తో ఉంది ధోని సేన. ఆ జట్టు గానీ తలచుకుంటే ప్లేఆఫ్స్ కోసం తప్పక గెలవాల్సిన సిచ్యువేషన్‌లో ఉన్న పంజాబ్‌ను ముంచేయడం ఖాయం. అయ్యర్ సేనపై రషీద్, మాత్రే, బ్రేవిస్, నూర్ లాంటి యువ ఆటగాళ్లతో కూడిన గట్టి ప్లేయింగ్ ఎలెవన్‌ను దింపుతుండటంతో ఇవాళ స్ట్రాంగ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. ప్లేయింగ్ ఎలెవన్‌లో మొత్తంగా ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం..


చెన్నై సూపర్ కింగ్స్ (అంచనా): షేక్ రషీద్, ఆయుష్ మాత్రే, దీపక్ హూడా, సామ్ కర్రన్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబె, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్/కెప్టెన్), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీష పతిరానా.

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్: అన్షుల్ కాంబోజ్.

పంజాబ్ కింగ్స్ (అంచనా): ప్రియాన్ష్ ఆర్య, ప్రభుసిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, గ్లెన్ మాక్స్‌వెల్, అజ్మతుల్లా ఒమర్జాయి/జేవియర్ బార్ట్‌లెట్, మార్కో జాన్సన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్: హర్‌ప్రీత్ బ్రార్.


ఇవీ చదవండి:

నా భర్త కోసం స్కెచ్ వేశారు: పుజారా భార్య

రింకూ చెంప చెల్లుమనిపించిన కుల్దీప్

రింకూను కావాలనే కొట్టాడా..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 30 , 2025 | 06:08 PM