Share News

Bengaluru Stampede: నా కొడుకు శరీరాన్ని కోయొద్దు.. ఈ తండ్రి బాధ ఎవరికీ రాకూడదు!

ABN , Publish Date - Jun 05 , 2025 | 11:16 AM

ఆర్సీబీ విక్టరీ పరేడ్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన అందర్నీ కలచివేసింది. అభిమాన క్రికెటర్లతో కలసి సెలబ్రేషన్ చేసుకుందామని వచ్చిన వారు విగతజీవులవడం అంతులేని బాధను మిగిల్చింది.

Bengaluru Stampede: నా కొడుకు శరీరాన్ని కోయొద్దు.. ఈ తండ్రి బాధ ఎవరికీ రాకూడదు!
Bengaluru Stampede

ఒక్కడే కొడుకు.. ఇంట్లో చెప్పకుండా వచ్చాడు. అభిమాన క్రికెటర్ల గెలుపు సంబరాల్లో తానూ భాగం కావాలని అనుకున్నాడు. కానీ తొక్కిసలాట రూపంలో మృత్యువు అతడ్ని కబళించింది. ఆర్సీబీ విక్టరీ పరేడ్‌లో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన అతడి కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. కన్నబిడ్డను కోల్పోయిన అతడి తండ్రి వేదన అందరి హృదయాలను మెలిపెడుతోంది. కుమారుడు ఇక లేడనే విషయాన్ని తలచుకొని ఆ తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు. దయచేసి.. తన బిడ్డ శరీరాన్ని కోయొద్దు అంటూ ప్రభుత్వాన్ని కోరాడు. ఈ ఘటన గురించి మరింతగా తెలుసుకుందాం..


ముక్కలు చేయొద్దు..

ఆర్సీబీ విక్టరీ పరేడ్‌లో 11 మంది చనిపోయారు. ఇంకా చాలా మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఓ యువకుడి తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు. ‘నాకు ఒక్కడే కొడుకు. ఇంట్లో చెప్పకుండా ఇక్కడికి వచ్చాడు. తొక్కిసలాటలో అతడు చనిపోయాడు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మా ఇంటికి వచ్చి పరామర్శించినా.. ఈ లోకాన్ని విడిచిన నా బిడ్డను మాత్రం తీసుకురాలేరు. అందుకే అతడి మృతదేహాన్ని అయినా మాకు అప్పగించండి. పోస్ట్‌మార్టం పేరుతో నా కొడుకు శరీరాన్ని మాత్రం ముక్కలు చేయొద్దు’ అని కర్ణాటక సర్కారును కోరాడా తండ్రి.


రూల్స్ ప్రకారం..

ఆర్సీబీ తొక్కిసలాటలో చనిపోయిన వారికి నిబంధనల ప్రకారం పంచనామా పూర్తి చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు. గాయపడిన వారిని ఆస్పత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. చికిత్స పొందుతున్న వారిని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పరామర్శించారు. ఈ ఘటన మీద విచారణకు ఆదేశించిన సీఎం.. 15 రోజుల్లోగా నివేదిక వస్తుందని తెలిపారు. అటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెప్పారు.


ఇవీ చదవండి:

బెంగళూరు విషాదంపై సచిన్ రియాక్షన్

మాల్యా గాలి తీసిన ఎస్‌బీఐ!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 05 , 2025 | 11:17 AM