BCCI: ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు వేధింపులు.. స్పందించిన బీసీసీఐ
ABN , Publish Date - Oct 25 , 2025 | 06:27 PM
ఆస్ట్రేలియా జట్టుకు చెందిన ఇద్దరు మహిళా క్రికెటర్లను ఆకతాయి వేధించినట్లు వార్తలు జోరుగా ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై బీసీసీఐ స్పందించింది. మహిళా క్రికెటర్లతో అనుచితంగా ప్రవర్తించడం దురదృష్టకరమని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అసహనం వ్యక్తం చేశారు.
వన్డే ప్రపంచ కప్(ODI) నేపథ్యంలో ఆస్ట్రేలియా మహిళా జట్టు భారత్‌లో పర్యటిస్తోంది. అయితే ఆస్ట్రేలియా(Australia) జట్టుకు చెందిన ఇద్దరు మహిళా క్రికెటర్లను ఆకతాయి వేధించినట్లు(Harassment) వార్తలు జోరుగా ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై బీసీసీఐ (BCCI)స్పందించింది. మహిళా క్రికెటర్లతో అనుచితంగా ప్రవర్తించడం దురదృష్టకరమని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా(Devajit Saikia) అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు దేశ గౌరవాన్ని దెబ్బతీస్తాయని అన్నారు. సమాచారం అందుకున్న వెంటనే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులను ఆయన అభినందించారు. మరోవైపు ఈ ఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అసలు ఏమైందంటే?
వన్డే ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా మహిళా జట్టు భారత్‌కు వచ్చింది. శనివారం ఇండోర్(Indore) వేదికగా ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇండోర్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో ఆ జట్టు బస చేసింది. ఈ క్రమంలో హోటల్ గది నుంచి ఇద్దరు మహిళా ప్లేయర్లు నడిచి వెళ్తుండగా ఓ ఆకతాయి వారితో అసభ్యంగా ప్రవర్తించినట్లు జట్టు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్(FIR) నమోదు చేసి నిందితుడు అకీల్‌ను అదుపులోకి తీసుకున్నారు.
కీలక మ్యాచ్‌కు సర్వం సిద్ధం
వన్డే ప్రపంచ కప్‌లో శనివారం కీలక మ్యాచ్ జరగనుంది. ఇండోర్ వేదికగా ఆసీస్ ఇంగ్లండ్(England)తో తలపడనుంది. సెమీస్‌లో టీమిండియా (Team India) ప్రత్యర్థి ఎవరో కూడా ఈ మ్యాచ్‌తో తేలిపోతుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్, భారత్ ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. అయితే నాలుగో స్థానంలో ఉన్న భారత జట్టు మొదటి ప్లేస్‌లో నిలిచే జట్టుతో సెమీస్‌లో తలపడనుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Gautam Gambhir's Reaction: రోహిత్ శర్మ 50వ సెంచరీ.. గంభీర్ అదిరిపోయే రియాక్షన్
Rohit Sharma: ఫీల్డింగ్‌లోనూ సెంచరీ చేసిన రోహిత్ శర్మ.. అదెలాగంటే?