Share News

BCCI: బీసీసీఐ కొత్త రూల్స్.. ఈ సీజనే వాళ్లకు లాస్ట్

ABN , Publish Date - May 15 , 2025 | 09:59 AM

IPL 2025 Restart: ఐపీఎల్-2025 రీస్టార్ట్‌కు ముందు భారత క్రికెట్ బోర్డు కొత్త రూల్స్ ప్రవేశపెట్టిందని తెలుస్తోంది. ఆ ఆటగాళ్లకు ఇదే లాస్ట్ సీజన్ కానుందట. అసలేం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం..

BCCI: బీసీసీఐ కొత్త రూల్స్.. ఈ సీజనే వాళ్లకు లాస్ట్
IPL 2025 Restart

భారత క్రికెట్ బోర్డు ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ తీసుకొస్తూ ఉంటుంది. దేశవాళీ క్రికెట్‌తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సమయానుకూలంగా అవసరమైనప్పుడు నిబంధనల్ని సడలించడం, కొత్త రూల్స్‌ను ప్రవేశపెట్టడం లాంటివి చేస్తుంది. ఇప్పుడు కూడా మరోమారు నయా రూల్స్ తీసుకొచ్చిందట బీసీసీఐ. భారత్-పాకిస్థాన్ నడుమ ఉద్రిక్తతల వల్ల మధ్యలోనే నిలిచిపోయిన ఐపీఎల్-2025లో నయా రూల్స్‌ తెచ్చిందట బోర్డు. క్యాష్ రిచ్ లీగ్‌లోని మిగతా మ్యాచులకు ఇవి వర్తిస్తాయని తెలుస్తోంది. ఈ సీజన్‌లో ఆడే పలు ఆటగాళ్లకు వచ్చేసారి అవకాశం ఉండబోదని, వాళ్లకు ఇదే లాస్ట్ చాన్స్ కానుందని సమాచారం. అసలు భారత బోర్డు తీసుకొచ్చిన ఆ రూల్ ఏంటో ఇప్పుడు చూద్దాం..


అప్పటిదాకే..

ఇండో-పాక్ మధ్య ఉద్రిక్తతల వల్ల క్యాష్ రిచ్ లీగ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో ఓవర్సీస్ ఆటగాళ్లంతా సొంతూళ్లకు వెళ్లిపోయారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందంతో క్రమంగా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటుండటంతో ఐపీఎల్‌లోని మిగిలిన మ్యాచుల్ని మే 17 నుంచి నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. కానీ బిజీ షెడ్యూల్స్ వల్ల పలు విదేశీ ప్లేయర్లు భారత్‌కు వచ్చేందుకు నిరాకరించారు. దీంతో వారి స్థానంలో ఇతర ఓవర్సీస్ ఆటగాళ్లను భర్తీ చేసే అవకాశాన్ని ఫ్రాంచైజీలకు కల్పించింది బోర్డు. అయితే రీప్లేస్‌మెంట్‌ కింద వచ్చిన ప్లేయర్లు వచ్చే సీజన్‌లో ఆడరని.. ఈ సీజన్‌లో ఆడే చివరి మ్యాచ్‌తో జట్లతో వాళ్ల బంధం ముగుస్తుందని స్పష్టం చేసిందట.


అదే డెడ్‌లైన్..

రీప్లేస్‌మెంట్ కింద జట్లలోకి చేరిన ఆటగాళ్లు వచ్చే ఐపీఎల్ ఆక్షన్‌లో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ స్పష్టం చేసిందని తెలుస్తోంది. ఎవరి స్థానాల్లో ఎవర్ని భర్తీ చేస్తున్నారో తమకు చెప్పాలని ఫ్రాంచైజీలకు ఈమెయిల్ చేసిందట బోర్డు. రీప్లేస్‌మెంట్ ప్రక్రియకు మే 25వ తేదీ డెడ్‌లైన్.. ఆలోగా ఆటగాళ్లు వస్తారో.. రారో తేల్చుకొని వాళ్ల స్థానాల్లో ఇతరులను భర్తీ చేయడం పూర్తి చేయాలని ఆదేశించిందని సమాచారం. కాగా, కొన్ని జట్లు రీప్లే‌స్‌మెంట్ మొదలుపెట్టేశాయి. జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ మిగిలిన మ్యాచులకు అందుబాటులో లేకపోవడంతో అతడికి బదులు బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను రీప్లేస్ చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. ఇతర టీమ్స్ కూడా ఈ పనుల్లో బిజీగా ఉన్నాయి.


ఇవీ చదవండి:

ఆర్సీబీకీ అదిరిపోయే న్యూస్

నీరజ్‌ ఇక లెఫ్టినెంట్‌ కల్నల్‌

ఏ ప్లస్‌ లోనే రోహిత్‌ విరాట్‌

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 15 , 2025 | 11:11 AM