Share News

Arjun Tendulkar: అర్జున్ అదరహో..

ABN , Publish Date - Oct 26 , 2025 | 03:14 PM

రంజీ ట్రోఫీ 2025 సీజన్‌లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొడుకు, గోవా స్టార్ ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్ అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. చంఢీగర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఏకంగా వంద పరుగులు సమర్పించుకున్నఅర్జున్..

Arjun Tendulkar: అర్జున్ అదరహో..

రంజీ ట్రోఫీ 2025(Ranji Trophy 2025) సీజన్‌లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొడుకు, గోవా స్టార్ ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్(Arjun Tendulkar) అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. చంఢీగర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఏకంగా వంద పరుగులు సమర్పించుకున్నఅర్జున్.. శిమొగా వేదికగా కర్ణాటకతో జరుగుతున్న మ్యాచ్‌లో మాత్రం సత్తా చాటాడు.


అర్జున్ తన బౌలింగ్‌లో కర్ణాటక టాప్ ఆర్డర్ ఒక్కసారిగా కుప్పకూలింది. గోవా తరఫున బౌలింగ్ ఎటాక్‌ను ప్రారంభించిన ఈ స్పీడ్‌స్టర్.. కర్ణాటక ఓపెనర్ నికిన్ జోస్‌ను మూడు పరుగులకే పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత వెంటనే వికెట్ కీపర్ బ్యాటర్ కృష్ణన్ శ్రీజిత్‌ను డకౌట్ చేశాడు.


అంతేకాకుండా క్రీజులో సెట్ అయిన అభినవ్ మనోహర్‌ను కూడా అర్జున్‌ బోల్తా కొట్టించాడు. తొలి రోజు ఆటలో12.2 ఓవర్లు బౌలింగ్‌ చేసిన అర్జున్ టెండూల్కర్.. మూడు వికెట్లు పడగొట్టి కేవలం 33 పరుగులే ఇచ్చాడు. అర్జున్‌ సూపర్‌ స్పెల్‌తో పాటు మరో ఫాస్ట్ బౌలర్ వాసుకి కౌశిక్ రెండు కీలక వికెట్లు తీసి గోవా జట్టును టాప్‌లో ఉంచారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కర్ణాటక 5 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. కాగా అర్జున్ టెండూల్కర్ 2021-2022 సీజన్ తర్వాత ముంబై నుంచి గోవాకు మారిన సంగతి తెలిసిందే.


Also Read:

Andhra Pradesh Cyclone: ఏపీకి పొంచి ఉన్న ముప్పు.. ఈ ప్రాంత ప్రజలు జాగ్రత్త..!

Constipation Home Remedies: రోజూ ఈ మూడు విత్తనాలు తింటే మలబద్ధకం సమస్యకు చెక్!

Boost Immunity This Winter: చలికాలంలో మీ ఇమ్యూనిటీని పెంచే ఐదు డ్రింక్స్..

Updated Date - Oct 26 , 2025 | 03:15 PM