Boost Immunity This Winter: చలికాలంలో మీ ఇమ్యూనిటీని పెంచే ఐదు డ్రింక్స్..
ABN , Publish Date - Oct 26 , 2025 | 03:02 PM
చలికాలంలో వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గుతుంది. అలాంటప్పుడు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. లేదంటే తరచుగా ఆరోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ఈ ఐదు డ్రింక్స్ తాగితే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది.
చలికాలం మొదలైంది. సాయంత్రం ఆరు నుంచే వాతావరణం చల్లగా మారిపోతోంది. ఉదయం పది వరకు కూడా వాతావరణం చల్లగానే ఉంటోంది. చలికాలం వచ్చిందంటే చాలు వ్యాధి నిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం పడుతుంది. రోగాలు శరీరంపై ఇట్టే దాడి చేసేస్తాయి. జలుబు, దగ్గుతో పాటు ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో రోగాలు రాకుండా ఉండాలంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచే (Naturally Boost Immunity) ఈ ఐదు డ్రింక్స్ తప్పని సరిగా తీసుకోవాలి.
మసాలా చాయ్
మసాలా చాయ్ (Masala Chai) రుచిగా ఉండటం మాత్రమే కాదు. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణాలు మసాలా చాయ్‌లో చాలా ఉన్నాయి. ఉదయాన్నే మసాలా చాయ్ తాగితే రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. మసాలా టీని యాలుకలు, అల్లం, చెక్క, లవంగాలతో తయారు చేసుకోవాలి.
పసుపు కలిపిన పాలు
పసుపు పాల (Haldi Doodh) కోసం పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు. పాలలో కొంచెం పసుపు కలిపి తాగితే సరిపోతుంది. కొంచెం మిర్యాల పోడి, తేనె కలుపుకుంటే చాలా మంచిది. పసుపు పాల వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది.
బాదం పాలు
బాదం పాలతో( Badam Milk) కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కాదు. బాదం పాలలో ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడుతుంది. సీజనల్ రోగాలకు బాదం పాలు మంచి ఔషధంలా పని చేస్తాయి.
కుంకుమ పువ్వు పాలు
కుంకుమ పువ్వు కలిపిన పాల వల్ల చాలా రకాల లాభాలు ఉన్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. యాలుకలు, ఇతర డ్రై ఫ్రూట్ కలిసి కుంకుమ పువ్వులతో(Saffron Milk) డ్రింక్ చేసుకుని తాగితే రుచికి, రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.
తులసీ టీ
వ్యాధి నిరోధక శక్తికి పెంపొందించటంలో తులసి టీని(Tulsi Tea) మించిన టీ ఇంకోటి లేదంటే అతిశయోక్తి కాదు. తులసి టీలో కొంచెం అల్లం, బ్లాక్ పెప్పర్, లవంగాలు వేసుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు.
(Note: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
ఇవి కూడా చదవండి
20 నెలల్లో నూతన బీహార్‌ను ఆవిష్కరిస్తాం.. తేజస్వి పిలుపు
దుమ్ము లేపుతున్న కరుణ్ నాయర్.. జట్టులోకి తిరిగొస్తాడా?