Share News

Womens World Cup: బెంగళూరు అవుట్‌

ABN , Publish Date - Aug 23 , 2025 | 04:12 AM

ఊహించినట్టుగానే మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా బెంగళూరులో జరగాల్సిన ఐదు మ్యాచ్‌లను తరలించారు. చిన్నస్వామి స్టేడియంలో వీటి నిర్వహణకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవడంలో అక్కడి క్రికెట్‌ సంఘం..

Womens World Cup: బెంగళూరు అవుట్‌

  • షెడ్యూల్‌లో మార్పులు

  • మహిళల వన్డే వరల్డ్‌కప్‌

న్యూఢిల్లీ: ఊహించినట్టుగానే మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా బెంగళూరులో జరగాల్సిన ఐదు మ్యాచ్‌లను తరలించారు. చిన్నస్వామి స్టేడియంలో వీటి నిర్వహణకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవడంలో అక్కడి క్రికెట్‌ సంఘం (కేఎ్‌ససీఏ) విఫలమైంది. దీంతో ఈ మ్యాచ్‌లన్నింటినీ నవీ ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియానికి తరలిస్తున్నట్టుగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో చాంపియన్‌గా నిలిచిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు విజయోత్సవ ర్యాలీ కారణంగా స్టేడియం బయట తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 11 మంది మృతి చెందడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించి చిన్నస్వామిలో ప్రస్తుతానికి మ్యాచ్‌లను నిషేధించింది. ఇక డీవై పాటిల్‌ స్టేడియంలో మూడు లీగ్‌ మ్యాచ్‌లు ఓ సెమీస్‌, ఫైనల్‌ జరగాల్సి ఉంది. కానీ టైటిల్‌ పోరు మాత్రం పాక్‌ జట్టు విజయాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ దాయాది జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తే ఆ మ్యాచ్‌ కొలంబోలో నిర్వహిస్తారు. ఓవరాల్‌గా నవీ ముంబై, విశాఖపట్నం, గువాహటి, ఇండోర్‌, కొలంబోలో మహిళల వన్డే వరల్డ్‌కప్‌ జరుగుతుంది. మరోవైపు చిన్నస్వామి స్టేడియం వ్యవహారాన్ని కర్ణాటక రాష్ట్ర క్రికెట్‌ సంఘం ఓ కొలిక్కి తేలేకపోతే వచ్చే ఏడాది ఐపీఎల్‌ మ్యాచ్‌లకు కూడా దూరం కావాల్సి ఉంటుంది.మరికొన్ని మార్పులు..: ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌లో ఐసీసీ కొన్ని వేదికలను మార్చింది. దీనిలో భాగంగా సెప్టెంబరు 30న ఆతిథ్య జట్లు భారత్‌-శ్రీలంక మధ్య జరగాల్సిన ఆరంభ మ్యాచ్‌ను బెంగళూరు నుంచి గువాహటికి తరలించారు. అక్టోబరు 3న ఇంగ్లండ్‌-దక్షిణాఫ్రికా మ్యాచ్‌ కూడా గువాహటిలోనే జరుగుతుంది. అంతేకాకుండా 10న కివీ్‌స-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ను వైజాగ్‌ నుంచి గువాహటికి మార్చారు. ఇక అదే నెల 20న జరిగే శ్రీలంక-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌, 23న జరిగే భారత్‌-కివీ్‌స మ్యాచ్‌లను నవీ ముంబైకి మార్చారు. మొత్తంగా విశాఖలో ఐదు మ్యాచ్‌లు జరుగనుండగా.. భారత జట్టు దక్షిణాఫ్రికా, ఆస్ర్టేలియాలతో ఇక్కడే ఆడనుంది.


CGN.jpg

సెలెక్టర్ల కోసం దరఖాస్తులు

భారత క్రికెట్‌ జట్ల సెలెక్టర్ల కోసం వచ్చే నెల 10 లోగా బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందులో పురుషుల క్రికెట్‌ కోసం రెండు, మహిళల క్రికెట్‌ కోసం నలుగురు సెలెక్టర్లను భర్తీ చేయాల్సి ఉంది. చీఫ్‌ సెలెక్టర్‌ అగార్కర్‌ (వెస్ట్‌ జోన్‌), అజయ్‌ రాత్రా (నార్త్‌)ల పదవీ కాలాన్ని బోర్డు మరో ఏడాది పొడిగించింది. దీంతో సౌత్‌, సెంట్రల్‌ జోన్ల సెలెక్టర్లను భర్తీ చేయాల్సి ఉంది. అయితే సౌత్‌ నుంచి మాజీ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజాకు దాదాపు చోటు ఖాయమైనట్టు సమాచా రం. మహిళల సెలెక్షన్‌ కమిటీలో శ్యామా డే షా మాత్రం కొనసాగనుండగా మిగతా నలుగురిని నియమించాల్సి ఉంది. మరోవైపు పురుషుల క్రికెట్‌ సెలెక్టర్‌గా పదవీకాలం ముగిసిన ఎస్‌.శరత్‌.. రెండోసారి జూనియర్‌ క్రికెట్‌ సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించడం దాదాపు ఖాయమైంది.


ఇవి కూడా చదవండి

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 23 , 2025 | 04:13 AM