Asia Cup 2025 Format: ఆసియా కప్ 2025 సిద్ధం..ఫార్మాట్, టీమ్‌లు, ఫస్ట్ మ్యాచ్ ఎక్కడో తెలుసా
ABN , Publish Date - Sep 08 , 2025 | 12:45 PM
క్రికెట్ లవర్స్‌కి మళ్లీ పండుగ లాంటి సీజన్ వచ్చేసింది. ఎందుకంటే ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి మొదలు కాబోతుంది. ఈసారి టోర్నమెంట్ టీ20 ఫార్మాట్‌లో జరుగుతుంది. కాబట్టి ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠగా కొనసాగనుంది.
క్రికెట్ ప్రియులకు మళ్లీ గుడ్ న్యూస్ వచ్చింది. 2025 ఆసియా కప్ (Asia Cup 2025) సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి టోర్నమెంట్ T20 ఫార్మాట్‌లో జరుగుతుంది. ఈసారి ఆసియా కప్‌ను టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేశారు. ఎందుకంటే 2025 అక్టోబర్‌లో భారత్, శ్రీలంక సంయుక్తంగా టీ20 వరల్డ్ కప్ నిర్వహించబోతున్నాయి.
దీంతో అన్ని ఆసియా జట్లు తమ బలహీనతల్ని తెలుసుకునే మంచి ఛాన్స్‌గా ఈ టోర్నీని భావిస్తున్నాయి. ఈ సారి టోర్నమెంట్ మళ్లీ T20 ఫార్మాట్‌లో జరగనుంది. అది కూడా 2026లో భారత్, శ్రీలంకల్లో జరిగే ICC T20 వరల్డ్ కప్‌కి సన్నాహకంగా. గతంలో 2022లో శ్రీలంక ఆసియా కప్‌ని గెల్చుకుంది. దుబాయ్‌లో జరిగిన ఫైనల్‌లో పాకిస్తాన్ జట్టును ఓడించింది.
ఆసియా కప్ 2025 ఫార్మాట్
ఈ సారి ఆసియా కప్ మూడు దశల్లో జరుగుతుంది. గ్రూప్ దశ, సూపర్ 4, ఫైనల్. ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విభజించబడ్డాయి. ప్రతి గ్రూప్‌లో నాలుగు జట్లు ఉంటాయి.
గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, ఒమన్, UAE
గ్రూప్ బీలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్
గ్రూప్ దశ
ఈ దశలో ప్రతి గ్రూప్‌లోని జట్లు ఒకరినొకరు ఒక్కసారి తలపడతాయి. అంటే గ్రూప్ ఏలో భారత్ vs పాకిస్తాన్ (team india vs Pakistan), భారత్ vs ఒమన్, భారత్ vs UAE ఇలా మ్యాచ్‌లు ఉంటాయి. అదే విధంగా గ్రూప్ బీలో కూడా. ఈ గ్రూప్ దశలో టాప్-2 జట్లు సూపర్ 4కి అర్హత సాధిస్తాయి. అంటే ప్రతి గ్రూప్ నుంచి రెండు జట్లు ముందుకు వెళతాయి. ఇక్కడ భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఫ్యాన్స్‌కి చాలా ఆసక్తి ఉంటుంది.
సూపర్ 4 దశ
సూపర్ 4లో గ్రూప్ A, గ్రూప్ B నుంచి వచ్చిన నాలుగు జట్లు రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో ఆడతాయి. అంటే ఈ నాలుగు జట్లూ ఒకరినొకరు ఒక్కసారి తలపడతాయి. ఈ దశలో టాప్-2 జట్లు ఫైనల్‌కి చేరుకుంటాయి. ఈ దశలో ప్రతి మ్యాచ్ కీలకం కానుంది. ఎందుకంటే ఒక్క ఓటమి కూడా జట్టు ఫైనల్ రేస్ నుంచి బయటకి వెళ్లేలా చేస్తుంది.
ఫైనల్
సూపర్ 4 దశలో టాప్-2లో నిలిచిన జట్లు సెప్టెంబర్ 28, 2025న దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్ ఆడతాయి. ఈ మ్యాచ్ ఆసియా కప్ ట్రోఫీ కోసం జరిగే అతి పెద్ద ఫైట్ అని చెప్పవచ్చు. 2022లో శ్రీలంక ఇక్కడే పాకిస్తాన్ జట్టును ఓడించి కప్ గెలిచింది. మరి ఈ సారి ఎవరు గెలుస్తారో చూడాలి మరి.
మొదటి మ్యాచ్ ఎక్కడ?
ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9న రాత్రి 8 గంటలకు మొదలవుతుది. టోర్నమెంట్ దుబాయ్‌లో (dubai) జరుగుతుంది. ఫైనల్ కూడా ఇక్కడే జరుగుతుంది. ఆసియా కప్ అంటే కేవలం క్రికెట్ మాత్రమే కాదు. ఆసియా దేశాల మధ్య ఒక ఉత్కంఠభరితమైన పోటీ అని చెప్పవచ్చు. శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి జట్లు సర్‌ప్రైజ్‌లు ఇస్తుంటాయి. ఒమన్, UAE, హాంకాంగ్ లాంటి జట్లు ఈ సారి ఏదైనా అద్భుతం చేస్తాయేమో చూడాలి.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి