Adar Poonawalla RCB: ఆర్‌సీబీ ఫ్రాంచైజీకి కొత్త ఓనర్..అదార్ పూనావాలాతో వేగంగా చర్చలు!
ABN , Publish Date - Sep 30 , 2025 | 06:08 PM
ఐపీఎల్లో అభిమానులను ఉర్రూతలూగించే జట్టుగా గుర్తింపు పొందిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఓనర్ మారనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ మద్యం సంస్థ డియాజియో, RCB యాజమాన్యంలో తన వాటాను విక్రయించేందుకు ప్రాథమిక ప్రక్రియ ప్రారంభించినట్లు సమాచారం. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో మరో భారీ ఒప్పందం జరగనున్నట్లు తెలుస్తోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీని అమ్మే ప్రయత్నం చేస్తుండగా, సీరమ్ ఇన్స్టిట్యూట్ సీఈఓ అదార్ పూనావాలా కొనుగోలుదారుల్లో ముందంజలో ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, ప్రముఖ మద్యం సంస్థ డియాజియో తనకు చెందిన RCB వాటాను అమ్మేందుకు సిద్ధమవుతోంది.
దీని కోసం సిటీ బ్యాంక్‌ను ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌గా నియమించిందట. దియాజియో, ఈ ప్రాంచైజీకి దాదాపు $2 బిలియన్ (సుమారు రూ. 16,000 కోట్లకు పైగా) విలువను ఆశిస్తోంది. అంత పెద్ద మొత్తం ఒక్కసారిగా చెల్లించాలన్న షరతు వల్ల కొనుగోలుదారులు కొంత వెనుకంజ వేస్తున్నట్టు సమాచారం.
ముందంజలో అదార్ పూనావాలా
ఈ డీల్‌లో ముందంజలో ఉన్న పేరు అదార్ పూనావాలా. అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ అయిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సీఈఓ. ఇప్పటివరకు వారి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ విషయంలో పూనావాలా పేరు తెగ చక్కర్లు కొడుతోంది. అతని స్థాయికి తగ్గ ప్రతిష్టతోనే RCBని కొనుగోలు చేసి మరింత రిచ్ అవ్వాలని చూస్తున్నారని పలువురు భావిస్తున్నారు.
ఎందుకు అమ్ముతోంది?
RCB ఓ ఎగ్జైటింగ్ బిజినెస్ కానీ, ఇది మా కోర్ బిజినెస్ కాదని డియాజియో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ సోమేశ్వర్ ఇటీవల అన్నారు. అంటే ఇది వారి ప్రాధాన్యతలో లేదని స్పష్టం చేశారు. దీంతో RCB అమ్మకానికి సిద్ధమయ్యారని పలువురు చెబుతున్నారు. ఇప్పటికే సిటీ బ్యాంక్‌ను సంప్రదించడం ద్వారా, వారు సంపూర్ణంగా తమ వాటాను విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.
IPLలో భారీ డీల్‌కే?
ఈ డీల్ పూర్తైతే ఇది IPL చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందం అవుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇటీవలే టారెంట్ గ్రూప్, గుజరాత్ టైటాన్స్‌లో 67% వాటాను కొనుగోలు చేసిన డీల్ దాదాపు రూ. 7,500 కోట్లుగా ఉంది. దీంతో ఇప్పుడు ఆర్సీబీ IPL ఫ్రాంచైజీకి భారీ డిమాండ్ ఏర్పడుతోంది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
రూ.485కే 72 రోజుల ప్లాన్..అన్‌లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ డేటా
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి