Share News

Brian Bennett World Record: ఆరు బంతుల్లో 6 ఫోర్లు.. 21 ఏళ్ల బ్యాట్స్‌మన్ ప్రపంచ రికార్డ్

ABN , Publish Date - Oct 03 , 2025 | 03:49 PM

జింబాబ్వే యువ ఆటగాడు బ్రియాన్ బెన్నెట్ తన ఆట తీరుతో క్రికెట్ ప్రపంచంలో సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ఈ 21 ఏళ్ల ఆటగాడు 72 గంటల్లోనే రెండు ప్రపంచ రికార్డులు సృష్టించి అరుదైన ఘనతను సాధించాడు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Brian Bennett World Record: ఆరు బంతుల్లో 6 ఫోర్లు.. 21 ఏళ్ల బ్యాట్స్‌మన్ ప్రపంచ రికార్డ్
Brian Bennett World Record

జింబాబ్వే బ్యాట్స్‌మన్ 21 ఏళ్ల బ్రియాన్ బెన్నెట్ (Brian Bennett) 72 గంటల్లోనే రెండు ప్రపంచ రికార్డులు సృష్టించి అరుదైన ఘనతను సాధించాడు. అక్టోబర్ 2న టీ20 ప్రపంచ కప్ 2026 అర్హత మ్యాచ్‌లో కెన్యాపై అరుదైన రికార్డును నెలకొల్పాడు. టీ20 ఇంటర్నేషనల్‌లో ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు కొట్టిన మొదటి బ్యాట్స్‌మన్‌గా బ్రియాన్ బెన్నెట్ నిలిచాడు.

ప్రపంచ కప్ క్వాలిఫైయర్‌ రెండో సెమీఫైనల్‌లో జింబాబ్వే ఇన్నింగ్స్‌లోని నాలుగో ఓవర్‌లో 21 ఏళ్ల యువ ఆటగాడు ఈ ఘనతను సాధించాడు. లూకాస్ ఒలుయోచ్ కెన్యా బౌలర్‌పై ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు కొట్టి ఈ రికార్డ్ క్రియేట్ చేశాడు.


51 పరుగులు..

కెన్యా మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 6 వికెట్లకు 122 పరుగులు చేసింది. జింబాబ్వే తరఫున బ్రియాన్ బెన్నెట్ బెస్ట్ ఇన్నింగ్స్ ఇచ్చాడు. అతను తన సహ ఓపెనర్‌తో కలిసి మొదటి వికెట్‌కు 76 పరుగులు చేశాడు. బెన్నెట్ తొలి వికెట్‌గా ఔటయ్యాడు. కానీ అంతకు ముందు అతను 51 పరుగులు చేశాడు. ఇందులో ఒకే ఓవర్‌లో 6 ఫోర్లు కొట్టడం విశేషం. గతంలో, సెప్టెంబర్ 30న టాంజానియాపై అతను 111 పరుగులతో తన తొలి T20I సెంచరీ సాధించాడు.

ఈ ఇన్నింగ్స్‌తో, అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్‌లలో (ఓడీఐ, రెండు టెస్టులు, ఒక టీ20) సెంచరీలు చేసిన అతి పిన్న వయస్కుడైన బ్యాట్స్‌మన్‌గా మరో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 2004లో జన్మించిన బెన్నెట్, తన అసాధారణ ప్రతిభతో ఒత్తిడిలో సంయమనంతో జింబాబ్వే క్రికెట్‌లో కొత్త రికార్డులు చేర్చాడు. అతని వరుస రికార్డులు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

రూ.485కే 72 రోజుల ప్లాన్..అన్‌లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ డేటా

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 03 , 2025 | 04:21 PM