Bride’s Dad Rejects Groom: కట్నం వద్దన్నందుకు పెళ్లి రద్దు.. యువకుడికి ఊహించని షాక్
ABN , Publish Date - Oct 03 , 2025 | 03:32 PM
కట్నం వద్దంటున్న యువకుడికి కచ్చితంగా ఏదో లోపం ఉండే ఉంటుందని భావించిన అమ్మాయి తండ్రి ఆ సంబంధాన్ని వద్దనుకున్నాడు. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట సంచలనంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: అతడో సంపన్న కుటుంబానికి చెందిన యువకుడు. ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. తనూ రూ.50 లక్షలకు పైగానే సంపాదిస్తున్నాడు. ఇంతకు మించిన డబ్బు ఎందుకని అనుకున్నాడో ఏమో కానీ అమ్మాయి తండ్రి కట్నం ఆఫర్ చేస్తే వద్దని చెప్పాడు. అదే చివరకు అతడి కొంప ముంచింది. వధువు తండ్రి పెళ్లి రద్దు చేయడంతో ఒక్కసారిగా షాకయిపోయాడు. యువకుడికి బంధువైన ఓ వ్యక్తి రెడిట్‌లో ఈ ఉదంతాన్ని షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది (dowry refusal leads rejection).
సదరు నెటిజన్ చెప్పిన వివరాల ప్రకారం, ఆ యువకుడి వయసు 27 ఏళ్లు. అతడి కుటుంబానికి రియలెస్టేట్, ఆతిథ్య రంగంలో పలు వ్యాపారాలు ఉన్నాయి. పెద్దల నుంచి వచ్చి ఆస్తిపాస్తులు కూడా బాగానే ఉన్నాయి. రూ.50 లక్షలపైగా సంపాదించే అతడు తన ఆదాయంపై సర్‌చార్జ్ కూడా చెల్లిస్తున్నాడు. ఓ బీఎమ్‌డబ్యూ కారు నడుపుతుంటాడు (bride’s dad rejects groom).
ఈ క్రమంలోనే అతడికి ఓ మంచి సంబంధం వచ్చింది. వధువుకు కెరీర్‌తో పాటు కుటుంబానికి సమప్రాధాన్యం ఇస్తుందట. ఇద్దరికీ ఒకరికొకరు నచ్చడంతో ఇరు కుటుంబాలు సంతోషించాయి. ఈ క్రమంలో కట్నం ప్రస్తావన వచ్చింది. వరుడు కట్నం కింద ఏం కోరుకుంటున్నాడో చెబితే ఇస్తానని వధువు తండ్రి అన్నాడు. తాను డూప్లెక్స్ ఫ్లాట్, ఓ రేంజ్ రోవర్ కారు ఇద్దామనుకుంటున్నట్టు చెప్పాడు. ఇంకేమైనా కావాలంటే అడగమని వరుడికి చెప్పాడు. అభ్యుదయ భావాలున్న యువకుడు మాత్రం అమ్మాయి తండ్రి ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాడు (dowry controversy).
వాస్తవానికి ఇలాంటి వ్యక్తికి పిల్లనిస్తున్నందుకు ఏ తల్లిదండ్రులైనా సంతోషిస్తారు. కానీ వరుడి తండ్రి మాత్రం వెంటనే పెళ్లి కుదరదని తేల్చి చెప్పాడు. ‘అతడు కట్నం వద్దంటున్నాడంటే ఏదో లోపం ఉన్నట్టే. ఉన్నత వ్యక్తులకు తమ విలువపై స్పష్టమైన అంచనా ఉంటుంది. వీవో, షావొమీ ఫోన్లు రూ.20 వేలకే వస్తుంటాయి. కానీ జనాలు లక్షలు పోసి ఐఫోన్‌లు కొనుగోలు చేస్తున్నందుకు కారణం ఇదే’ అని రివర్స్ లాజిక్ ప్రయోగించాడు. దీంతో, వరుడి కుటుంబానికి దిమ్మతిరిగినంత పనైంది.
ఇక ఈ ఉదంతంపై నెటిజన్లు కూడా రకరకాల కామెంట్స్ చేశారు. ఎంతో కొంత కట్నం ఇచ్చి కూతురికి ఆస్తిలో వాటా లేకుండా చేద్దామని తండ్రి అనుకుని ఉంటాడు. అది కుదరకపోవడంతో ఇలా చేసుంటాడు’ అని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. కట్నం ఇచ్చాక వరుడి కుటుంబాన్ని గుప్పిట్లో పెట్టుకుని కేసుల పేరిట బెదిరిద్దామని అనుకుని ఉంటాడు. అది కుదరకపోవడంతో వధువు తండ్రి అలా చేసుంటాడని మరికొందరు కామెంట్ చేశారు.
ఇవీ చదవండి:
లాటరీల జోలికెళ్లన వ్యక్తికి సడెన్‌గా బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.17 కోట్లు
అమెరికాలో చదివి ఇండియాకొచ్చాక నరకం.. రూ.20 వేల జీతం.. రూ.50 లక్షల అప్పు