US Lottery: లాటరీల జోలికెళ్లన వ్యక్తికి సడెన్‌గా బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.17 కోట్లు
ABN , Publish Date - Oct 02 , 2025 | 03:03 PM
లాటరీలను పెద్దగా పట్టించుకోని ఓ వ్యక్తికి ఊహించని ఆఫర్ వచ్చింది. లాటరీలో ఏకంగా రూ.17 కోట్లు దక్కడంతో రాత్రికి రాత్రికి అతడి జీవితమే మారిపోయింది. అమెరికాలో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశం అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: లాటరీల మీద చాలా మందికి నమ్మకం ఉండదు. తమకు అంత అదృష్టం లేదని అనుకుంటారు. నూటికో కోటికో ఒక్కరిని వరించే లక్ తమ దాకా రాదని గట్టిగా నమ్ముతారు. కానీ ఇలాంటి వారే రాత్రికి రాత్రి కోటీశ్వరులైపోతుంటారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయేది కూడా అలాంటి వ్యక్తి గురించే. సాధారణంగా లాటరీల జోలికెళ్లని ఈ వ్యక్తి ఒక రోజు అనుకోకుండా టిక్కెట్టు కొన్నాడు. అదే అతడి జీవితాన్ని మార్చేసింది. రాత్రి రాత్రికి సంపన్నుడిని చేసింది (Michigan Lottery 2 Million Dollars)
ప్రస్తుతం మనం చెప్పుకోబోతున్న లక్కీ ఫెలో అమెరికాలోని మిషిగన్ రాష్ట్రంలో ఉంటారు. ఇటీవల ఓ రోజు అతడు కాంటోన్ ఏరియాలోని ఓ సూపర్ మార్కెట్‌కు వెళ్లాడు. అక్కడ అతడికి 100x గేమ్‌కు సంబంధించి లాటరీ టిక్కెట్లు కనిపించాయి. ఎప్పుడూ లాటరీల జోలికెళ్లని సదరు వ్యక్తికి ఆ రోజు లాటరీపై మనసు మళ్లింది. చివరకు టిక్కెట్ కొన్నాడు. ‘నేను సాధారణంగా 100x గేమ్ జోలికెళ్లను. కానీ ఆ రోజు ఎందుకో లాటరీ టిక్కెట్ కొనాలనిపించింది’ అని అతడు చెప్పుకొచ్చాడు. తన టిక్కెట్‌ను స్క్రాచ్ చేసి చూస్తే తన నెంబర్ ఏమిటో అతడికి తెలిసింది. అదే నెంబర్‌కు లాటరీ తగలడంతో అతడు నమ్మలేకపోయాడు (US Scratch Off Lottery).
‘నేను చూస్తోంది ఏంటో మొదట అర్థం కాలేదు. రెండు మిలియన్‌ల సొమ్ము గెలుచుకోవడం ఆశ్చర్యపరిచింది. వెంటనే విషయాన్ని మా అమ్మకు చెప్పా. ఆమె కూడా ఒకటికి రెండు సార్లు పునఃపరిశీలన చేసి లాటరీ నిజమేనని చెప్పింది. దీంతో, నా ఆనందానికి పట్టపగ్గాలేకుండా పోయాయి’ అని అన్నాడు. కేవలం 20 డాలర్లు పెట్టి టిక్కెట్ కంటే ఏకంగా 2 మిలియన్ డాలర్లు వచ్చాయంటూ సంబరపడిపోయాడు.
ఈ డబ్బుతో ఏం చేయాలో కూడా ఆలోచించలేనంత సంబరంలో మునిగితేలుతున్నానని అతడు మొదట ఉబ్బితబ్బిబ్బైపోయాడు. అయితే, దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోనని, డబ్బును పెట్టుబడిగా మార్చి బంగరు భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటానని సంతోషపడుతూ చెప్పాడు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట కొనసాగుతోంది.
ఇవీ చదవండి:
అమెరికాలో చదివి ఇండియాకొచ్చాక నరకం.. రూ.20 వేల జీతం.. రూ.50 లక్షల అప్పు
స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకుని అతి చేష్టలు.. ఊహించని షాకిచ్చిన పోలీసులు