Spiderman Bike Stunt: స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకుని అతి చేష్టలు.. ఊహించని షాకిచ్చిన పోలీసులు
ABN , Publish Date - Aug 24 , 2025 | 11:35 AM
స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకుని నడి రోడ్డుపై బైక్‌తో స్టంట్స్ చేయబోయిన ఓ వ్యక్తికి ఒడిశా పోలీసులు ఊహించని షాకిచ్చారు. అతడి బైక్‌ను సీజ్ చేయడంతో పాటు ఏకంగా రూ.15 వేల జరిమానా విధించారు.
ఇంటర్నెట్ డెస్క్: అతి చేష్టల చేస్తూ పోలీసులకు చిక్కితే ఎలా ఉంటుందో ఓ యువకుడికి అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. ఒడిశాలోని రూర్కేలా నగరంలో ఈ ఘటన జరిగింది.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఆ యువకుడు స్పైడర్ మ్యాన్ డ్రెస్‌లో బైక్ నడుపుతూ రోడ్డు మీదకు వచ్చాడు. కనీసం హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. ఇది చాలదన్నట్టు ఇతర వాహనదారులకు ఇబ్బందులు సృష్టిస్తూ స్టంట్స్ చేశాడు. ఈ క్రమంలోనే పోలీసుల దృష్టిలో పడటంతో అతడికి భారీ షాక్ తగిలింది. ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్న అతడిని గుర్తించిన వెంటనే పోలీసులు అడ్డగించారు. ఏం చేస్తున్నావని ప్రశ్నించగా అతడు ఏం చెప్పాలో తెలీక నీళ్లు నమిలాడు. అతడి బైక్‌కు భారీ శబ్దం చేసే సైలెన్స్ ఉండటాన్ని కూడా పోలీసులు గుర్తించారు.
ఈ క్రమంలో అతడిపై పోలీసులు ఏకంగా రూ.15 వేల జరిమానా విధించారు. స్పీడ్ లిమిట్‌ను ఉల్లంఘించడం, హెల్మెట్ పెట్టుకోకపోవడం, భారీ శబ్దం చేసే సైలెన్సర్ వాడటం, రోడ్డుపై ప్రమాదకరమైన స్టంట్స్ చేయడం, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించడం తదితర చర్యలకు పాల్పడినందుకు ఈ మేరకు బారీ జరిమానా విధించారు. అతడి బైక్‌ను కూడా సీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ఉదంతం తెగ వైరల్ అవుతోంది.
ఇవీ చదవండి:
భారత్‌కు వచ్చి తప్పు చేశా.. లైఫ్ దిగజారుతోంది.. టెకీ ఆవేదన
వామ్మో.. భలే సీన్.. వందేళ్ల నాటి చర్చ్‌ను ఒక చోట నుంచి మరో చోటకు తరలింపు