Women Hanging Onto Train: రైల్లో యువతి ఫుట్ బోర్డింగ్.. షాకింగ్ వీడియో
ABN , Publish Date - May 12 , 2025 | 07:22 PM
ముంబైలోని ఓ లోకల్ రైల్లో యువతులు ఫుట్ బోర్డింగ్ చేస్తున్న షాకింగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. భారతీయ రైల్వేలో సేవా లోపాలపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ముంబై లాంటి నగరాల్లో లోకల్ రైళ్లకు ఉన్న ప్రాముఖ్యత అంతాఇంతా కాదు. లక్షల మంది ప్రతిరోజూ ఈ రైళ్లల్లో తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. అయితే, రైళ్ల కొరత, ఆలస్యాల కారణంగా కొన్ని అవాంఛిత ఘటనలు కూడా జరుగుతుంటాయి. ఓ ముంబై లోకల్ రైల్లో తాజాగా ఇలాంటి ఉదంతం వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చూసి జనాలు గగ్గోలు పెడుతున్నారు.
ముంబైలోని ఓ లేడీస్ స్పెషల్ లోకల్ రైల్లో ఈ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కళ్యాణ్ నుంచి బయలుదేరాల్సిన ఓ రైలు ఏకంగా 40 నిమిషాలు ఆలస్యం అయింది. దీంతో, ప్లాట్‌ఫామ్‌పై జనాలు భారీ స్థాయిలో వచ్చేశారు. రైల్లోకి పోటీ పడి ఎక్కేశారు. కొందరికి చోటు దొరక్క బోగీ మెట్లపై నిలబడి, ఇనుప కడ్డీలను పట్టుకుని ప్రమాదకరంగా జర్నీ చేశారు. మరికొందరు వారిని వారించారు. రైలు వేగంగా ప్రయాణిస్తుండటంతో చుట్టుపక్కలవారు ఏమీ చేయలేకపోయారు. మరికొందరు మాత్రం వీడియోలు తీశారు.
ఈ వీడియో నెట్టింట కాలుపెట్టి తెగ వైరల్ అవుతోంది. ఇలా ప్రమాదకర జర్నీ చేసిన యువతులను మందలించారు. రైల్వే అధికారుల తీరును కూడా కొందరు తప్పుబట్టారు. రైళ్లు ఆలస్యం కావడంతోనే విధిలేక యువతులు ఇలాంటి జర్నీలు చేయాల్సి వస్తోందని అన్నారు. కొందరు రైల్‌సేవను కూడా ట్యాగ్ చేశారు. ఈ అంశంపై దృష్టి సారించాలని అన్నారు. దీనికి స్పందించిన రైల్‌సేవ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొంది. కొందరు సెంట్రల్ రైల్వే పోలీసులను కూడా ట్యాగ్ చేశారు. ఈ విషయంపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.
‘‘ఆఫీసుకు వెళ్లే వారు కాస్తంత ముందుగా ఇంటి నుంచి బయలుదేరాలన్న విషయాన్ని మర్చిపోకూడదు. దీంతో, ఇలాంటి ప్రమాదకరప్రయాణాల అవసరం ఉండదు. బతుకుతెరువు కోసం వాళ్లీ కష్టాలు పడుతున్నారు. కానీ ఇలాంటి తప్పిదాలు శాశ్వత వైకల్యానికి దారి తీస్తాయి’’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ఇలాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయని మరొకరు విచారం వ్యక్తం చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ ట్రెండవుతోంది.
ఇవి కూడా చదవండి:
కృష్ణబిలంలో పడి నక్షత్రం ధ్వంసం.. అద్భుత ఫొటో షేర్ చేసిన నాసా
ఈ విషయాల్లో ప్రపంచానికంటే భారత్ బెటరంటున్న అమెరికా మహిళ
భారతీయులు కాస్తంత మర్యాదగా నడుచుకుంటే మంచిదంటున్న కెనడా పౌరుడు