Share News

YouTube: దారుణం.. యూట్యూబ్ చూసి ఆపరేషన్.. మహిళ మృతి..!

ABN , Publish Date - Dec 10 , 2025 | 05:27 PM

నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు. ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా నెట్టింట వెతికేస్తున్నారు. ఒక రకంగా ఉదయం లేచిన మొదలు.. రాత్రి పడుకునే వరకూ మనిషి జీవితంలో సోషల్ మీడియా ఒక భాగం అయ్యింది.

YouTube: దారుణం.. యూట్యూబ్ చూసి ఆపరేషన్.. మహిళ మృతి..!
Fake Surgery

ప్రపంచంలో రోజు రోజుకీ సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైపోతోంది. వంటలు చేసే దగ్గరి నుంచి మర్డర్ ప్లాన్ చేసే వరకూ ప్రతి ఒక్కటీ సోషల్ మీడియాలో చూసి ఫాలో అవుతున్నారు. అంతలా సోషల్ మీడియా మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తోంది. ఈ మధ్య కొంతమంది సోషల్ మీడియా చూస్తూ ఆరోగ్య చిట్కాలు పాటిస్తూ సొంత వైద్యం చేసుకుంటున్నారు. దారుణం ఏంటంటే.. ఓ అడుగు ముందుకేసి యూట్యూబ్ లాంటి సోషల్ మాధ్యమాలను ఫాలో అవుతూ ఆపరేషన్ కూడా చేస్తున్నారు. యూట్యూబ్ వీడియో ట్యుటోరియల్ చూసి శస్త్రచికిత్స చేయడంతో మహిళ మరణించింది. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో చోటు చేసుకుంది. అసలు ఏం జరిగిందో తెలియాలంటే మీరు ఈ కథనం చదివేయాల్సిందే.


ఉత్తర్ ప్రదేశ్‌లోని బారాబంకీ చెందిన తెహబహదూర్ రావత్ భార్య మునిశ్రా రావత్ కొంత కాలంగా కిడ్నీలో రాళ్లు రావడంతో కడుపునొప్పితో ఇబ్బంది పడుతుంది. డిసెంబర్ 5న ఆమెను కోఠిలోని శ్రీ దామోదర్ ఔషధాలయానికి తీసుకెళ్లాడు ఆమె భర్త. అక్కడ క్లినిక్ ఆపరేటర్ జ్ఞాన్ ప్రకాష్ మిశ్రా ఆమెను పరీక్షించిన తర్వాత కిడ్నీలో రాళ్లు ఉండటం వల్ల కడుపు నొప్పి వస్తుందని చెప్పాడు. వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని లేకుండా చనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. ఆ0పరేషన్ ఖర్చు రూ.25 వేలు అవుతుందని ముందుగా రూ.20 వేలు డిపాజిట్ చేయాల్సిందిగా భర్తకు తెలిపాడు. ఆపరేషన్ చేసే సమయంలో మిశ్ర మద్యం మత్తులో ఉన్నాడని.. యూట్యూబ్ వీడియో చూసిన తర్వాత ఆపరేషన్ ప్రారంభించినట్లు మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


మిశ్రాకు అతని మేనల్లుడు వివేక్ కుమార్ మిశ్రా సహాయం చేశాడని.. ప్రస్తుతం రాయబరేలీలో వివేక్ ఓ ఆయుర్వేద హాస్పిటల్ లో ఉద్యోగం చేస్తున్నాడని తెలిపాడు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నప్పటికీ అక్రమంగా క్లినిక్ నడిపిస్తున్నాడని పోలీసులు తెలిపారు. క్లీనిక్ ని సీజ్ చేశామని.. ఇద్దరిపై SC/ST (అత్యాచారాల నిరోధక) చట్టం, 1989 సెక్షన్లతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఇద్దరూ పరారీలో ఉన్నారని.. నిందితులను అరెస్టు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Viral Breakup at Gujarat: ఉల్లి తెచ్చిన లొల్లి.. 23 ఏళ్ల వివాహ బంధానికి తెర.!

High Court Serious on Cops: బాబోయ్.. అసలు వీళ్లు పోలీసులేనా?.. విద్యార్థిని కిడ్నాప్ చేసి..

Updated Date - Dec 10 , 2025 | 05:27 PM