Dehradun: ట్రైన్‌లో మహిళల వికృత చేష్ట.. బూతులు తిడుతూ, టీటీఈ ముఖంపై వేడి చాయ్ పోసింది!
ABN , Publish Date - Oct 18 , 2025 | 12:41 PM
జనరల్ టికెట్ తీసుకొని స్లీపర్ కోచ్‌లో రైలు ప్రయాణం ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్నించినందు టీటీఈని ఓ మహిళ దారుణంగా దూషించింది. అంతేకాదు ఏకంగా ముఖంపై చాయ్ పోసింది. ఇందుకు సంబంధించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 18: రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని వింత ఘటనలు ఎదురవుతుంటాయి. హిజ్రాల ఆగడాలు, దొంగతనాలు, ఆకతాయిల పోకడలు ఇలా అనేక రకమైన ఘటనలు చూసే ఉంటాం. కానీ ఈ మధ్య మరో ట్రెండు మొదలైంది. ఏకంగా మహిళలే ఈ వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. తాము ఏది చేసినా చెల్లుతుందని, అధికారులను సైతం పట్టించుకోకుండా తమ అవసరాలు మాత్రం చూసుకొని చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు జనరల్ టికెట్ తీసుకుని, స్లీపర్ కోచ్‌లో కొందరు ప్రయాణిస్తుంటారు. ఇప్పుడు మగవాళ్ల కంటే మహిళలే ఈ వికృత చేష్టకు పాల్పడుతున్నారు.
జనరల్ టికెట్ తీసుకుని ఏసీ, స్లీపర్ బెర్తుల్లో దర్జాగా ప్రయాణిస్తున్నారు. ఇక టీటీఈ వచ్చి అడిగినా లెక్క చేయట్లేదు. టీటీఈ గట్టిగా ప్రశ్నిస్త్తే ఆయన తనను అసభ్యంగా తాకాడని నిందలు వేస్తున్నారు. ఇదే అలవాటుగా కొందరు ఆడవాళ్లు ప్రయాణం చేస్తున్నారు. తమను అక్కడ ఇక్కడ తాకాడని రైల్వే అధికారులను బెదిరిస్తూ రూల్స్‌ని అతిక్రమిస్తున్నారు. కొందరు మహిళలు అయితే ఏకంగా టీటీఈ పైనే దాడికి యత్నిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో జరిగింది.
రాజధాని నగరం డెహ్రాడూన్‌లోని ఓ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు, రైల్వే అధికారిపైనే దురుసుగా ప్రవర్తించారు జనరల్ భోగిలో వెళ్లేందుకు టికెట్ తీసుకొని.. స్లీపర్ భోగిలో వీరు ప్రయాణిస్తున్నారు. చెకింగ్‌కి వచ్చిన టీటీఈ, వారిని ప్రశ్నించడంతో తొలుత కాస్త తడబడినా.. ఆ తర్వాత అసభ్య పదజాలంతో దూషించారు. స్లీపర్‌లో ఎందుకు ప్రయాణిస్తున్నావ్ అని అడిగినందుకు ఓ మహిళ టీటీఈ పైనే దాడి చేసింది. వేడి చాయ్‌ని టీటీఈ ముఖంపై పోసింది. వీరి మధ్య మాటలు..చిలికిచిలికి గాలి వానలా మారి కోపంతో చాయ్ ముఖంపై విసిరింది. టికెట్ అడిగినందుకు మహిళలు ఇలా దాడులు చేస్తున్నారని టీటీఈ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
POCSO Cases: పోక్సో కేసుల పరంపర.. తల్లిదండ్రుల ఆందోళన