Share News

Viral: వామ్మో.. ఇలాంటి కంపెనీలు కూడా ఉంటాయా? ఉద్యోగులు కోరిన శాలరీ ఇవ్వలేక...

ABN , Publish Date - Feb 11 , 2025 | 04:08 PM

పోటీ సంస్థల్లా ఉద్యోగులకు ఎక్కువ శాలరీలు ఇవ్వలేని ఓ చిన్న కంపెనీ ఉద్యోగులను ఆకర్షించేందుకు ఓ వింత ఆఫర్ ప్రవేశపెట్టింది. ఆఫర్ గురించి తెలుసుకున్న జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలాగైతే సంస్థలో పని జరుగుతుందా అని ప్రశ్నిస్తున్నారు.

Viral: వామ్మో.. ఇలాంటి కంపెనీలు కూడా ఉంటాయా? ఉద్యోగులు కోరిన శాలరీ ఇవ్వలేక...

ఇంటర్నెట్ డెస్క్: నేటి జమానాలో ఉద్యోగులను నిలుపుకోవడం సంస్థలకు కీలకంగా మారింది. మార్కెట్‌లో పోటీ సంస్థలు ఇస్తున్న స్థాయిలో జీతాలు ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే, అన్ని సంస్థలు ఉద్యోగులు ఆశించిన మేర జీతాలు ఇచ్చుకోలేవు. దీంతో, తామిచ్చే డబ్బుకు అంగీకరించే వారితో సర్దుకుపోవడం చేస్తుంటాయి. అది కూడా కుదరని పక్షంలో ఉన్న సిబ్బందితోనే నెట్టుకొస్తుంటాయి. కానీ జపాన్‌కు చెందిన ఓ సంస్థ మాత్రం ఇందుకు భిన్నమైన పంథాను ఎంచుకుని అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది (Viral).

ఒసాకాలోని ట్రస్ట్ రింగ్ కో అనే టెక్ కంపెనీ ఉద్యోగులకు వింత ఆఫర్ ప్రకటించి స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ సంస్థ చిన్నది కావడంతో భారీ సంస్థలు ఇచ్చే స్థాయిలో జీతాలు ఇవ్వలేకపోతోంది. కానీ నిపుణులైన ఉద్యోగులను నియమించుకోక తప్పనిసరి పరిస్థితి. దీంతో, ఉద్యోగులను ఆకర్షించేందుకు సంస్థ యాజమాన్యం ఊహించని ఆఫర్ ప్రకటించింది.


Viral: ఇది 1బీహెచ్‌కే ఇల్లు అట.. బెంగళూరులో పరిస్థితి మరీ ఇంతగా దిగజారిందా?

తమ సంస్థలో చేరితే జీతం తక్కువైనా ఎంజాయ్‌మెంట్‌కు మాత్రం ఏమాత్రం లోటు రాకుండా చూసుకుంటామని చెప్పింది. ఇందుకోసం ఉద్యోగులకు ఏకంగా పగటి పూట, ఆఫీసు సమయంలోనే ఉచితంగా మద్యం సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. సంస్థ యజమాని స్వయంగా ఉద్యోగులకు ఒకటో రెండో పెగ్గులు ఇస్తారట. వారితో పాటూ కూర్చుని తానూ మద్యం పుచ్చుకుంటారట. మరి కిక్క్ తలకెక్కి పనిచేయలేకపోతే వారికి రెస్టు తీసుకునేందుకు రెండు మూడు గంటల సమయం కూడా ఇస్తారట.


Passengers Enter Train Engine: వామ్మో.. కుంభమేళాకు ఇంత క్రేజా.. సీటు దొరక్క రైలు ఇంజెన్‌లోకి ఎక్కేసిన ప్రయాణికులు!

పోటీ సంస్థలతో సమానమైన జీతాలు ఇవ్వలేక, ఉద్యోగులకు ఓ కొత్త పని సంస్కృతిని రుచి చూపించి సంస్థలో కొనసాగేలా చేయాలనేది వారి ప్లాన్. ఇక ఈ సంస్థలో ఫ్రెషర్లకు 2.22 యెన్‌ల శాలరీ ఇస్తారు. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే ఇది దాదాపు రూ.1.27 లక్షలకు సమానం. అంతేకాకుండా, పని గంటలకు మించి ఓవర్ టైం పని చేస్తే అదనపు డబ్బు కూడా ఇస్తామని సంస్థ చెబుతోంది. దీంతో, ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై పెద్ద ఎత్తున స్పందిస్తున్న నెటిజన్లు ఇలాంటి కంపెనీలో ఒక్కసారైనా పనిచేయాలని కామెంట్ చేస్తున్నారు.

Bengali Signboard London Station: లండన్ స్టేషన్‌లో బెంగాలీ భాషలో బోర్డు.. ఎలాన్ మస్క్ రియాక్షన్ ఏంటంటే..

Read Latest and Viral News

Updated Date - Feb 11 , 2025 | 04:08 PM