Share News

Bengali Signboard London Station: లండన్ స్టేషన్‌లో బెంగాలీ భాషలో బోర్డు.. ఎలాన్ మస్క్ రియాక్షన్ ఏంటంటే..

ABN , Publish Date - Feb 10 , 2025 | 05:31 PM

లండన్‌లోని ఓ స్టేషన్ ముందు బెంగాలీ భాషలో బోర్డు ఉండటంపై స్థానిక ఎంపీ రూపర్ట్ లోవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. లోవ్ అభిప్రాయంతో టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ ఏకీభవించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు.

Bengali Signboard London Station: లండన్ స్టేషన్‌లో బెంగాలీ భాషలో బోర్డు.. ఎలాన్ మస్క్ రియాక్షన్ ఏంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: లండన్‌లోని ఓ రైల్వే స్టేషన్‌‌లో బెంగాలీ భాషలో స్టేషన్ పేరు రాసున్న సైన్ బోర్డుపై యూకేలో కొత్త వివాదం మొదలైంది. ఈ బోర్డుకు సంబంధించిన దృశ్యాన్ని షేర్ చేసిన యూకే ఎంపీ రూపర్ట్ లోవ్ ఘాటుగా స్పందించారు. ఇక్కడి స్టేషన్‌లోని బోర్డులు ఇంగ్లీష్‌లో మాత్రమే ఉండాలని, మరో భాషకు తావు లేదని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ‘‘ఇది లండన్. ఇక్కడి స్టేషన్ పేరును ఇంగ్లీష్‌లోనే రాయాలి.. ఇంగ్లిష్‌లో మాత్రమే’’ అని పోస్టు చేశారు. ఈ పోస్టు వైరల్ కావడంతో టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ దృష్టి పడింది. లోవ్ అభిప్రాయంతో ఏకీభవించిన మస్క్.. ‘ఎస్’ అని ఒక్క ముక్కలో సమాధానం ఇచ్చారు (NRI).


UK Illegal Immigration: అక్రమ వలసదారులకు యూకే కొరడా.. పార్లమెంటులో కొత్త బిల్లు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో అత్యంత ముఖ్యుడిగా మారిన ఎలాన్ మస్క్ గతంలోనే బ్రిటన్ నేత లోవ్‌కు మద్దతు ప్రకటించారు. రిఫార్మ్ యూకే పార్టీ నేతగా నైజెల్ ఫరాజ్‌కు బదులు లోవ్‌ను నియమించాలని పోస్టు చేశారు. వలసలకు అడ్డుకట్ట వేయాలని రిఫార్మ్ యూకే పార్టీ పట్టుబడుతున్న విషయం తెలిసిందే. దీంతో, పాటు ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య, పన్ను్ల్లో కోతకు ఈ పార్టీ డిమాండ్ చేస్తుంది.

ఇక సైన్ బోర్డు విషయంలో లోవ్ అభిప్రాయంతో కొందరు ఏకీభవించగా మరికొందరు మాత్రం విభేదించారు. ఇందులో తప్పు పట్టాల్సిందేమీ లేదని స్పష్టం చేశారు. ఇతర భాషల్లో స్టేషన్ పేరు కనిపిస్తే తప్పేంటని ప్రశ్నించారు.


Deportation of Indians: 15 ఏళ్లల్లో అమెరికా ఎంత మంది భారతీయుల్ని బహిష్కరించిందో చెప్పిన మంత్రి జైశంకర్

తూర్పు లండన్‌లోని బెంగాలీ సంతతి వారు స్థానికంగా చేసిన సేవలకు గుర్తింపుగా అక్కడి అధికారులు వైట్‌ఛాపెల్ ట్యూబ్ స్టేషన్‌ ముందు బెంగాలీలో స్టేషన్ పేరు రాసున్న ఓ బోర్డును 2022లో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన నిధులను టవర్ హామ్లె్ట్స్ కౌన్సిల్ సమకూర్చింది. బాంగ్లాదేశీ సంతతి వారు అత్యధిక సంఖ్యలో ఇక్కడే నివసిస్తుంటారు. ఈ చర్యను అప్పట్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా స్వాగతించారు. వెయ్యేళ్ల చరిత్ర ఉన్న బెంగాలి భాషకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ప్రాముఖ్యతకు చిహ్నమని అన్నారు. ఉమ్మడి సంస్కృతికి దిశగా అక్కడి వారు ముందుకు సాగాలని కూడా పిలుపునిచ్చారు.

Read Latest and NRI News

Updated Date - Feb 10 , 2025 | 05:31 PM