Pratyekam : ఒంటరి తల్లులకు పెరుగుతున్న కష్టాలు.. ఆడవారిగా పుట్టడమే పాపమా..
ABN , Publish Date - Feb 24 , 2025 | 08:35 PM
Single Mother's Faces Critical Problems : ఒంటరి తల్లుల కష్టాలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. విడాకులు పొందాక చేదు అనుభవాలు మరిచిపోయి కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలని కోరుకునేవారికి నిరాశ, అవమానాలే మిగులుతున్నాయి. వారి స్వేచ్ఛకు సూటి పోటి మాటలతో సంకెళ్లు వేస్తోంది సమాజం. ఆధునిక యుగంలోకి అడుగుపెట్టినా ఎందుకిలా జరుగుతోంది.. ఆడవారిగా పుట్టడమే వారు చేసిన పాపమా అనే ప్రశ్న వారి మదిని తొలిచేస్తోంది..

Single Mother's Faces Critical Problems : మగాళ్లు ఏం చేసినా సమాజం పెద్దగా పట్టించుకోదు.. 'వాడు మగాడురా' అని షో చేస్తుంది. మగాళ్లైతే ఏమైనా చేయవచ్చా అంటే చేయవచ్చని కుండబద్దలు కొడుతుంది. ఇటు ఆడవాళ్ల విషయంలో మాత్రం అతిగా రియాక్ట్ అవుతుంటుంది. ప్రతీ విషయంలోనూ అంతే. ముఖ్యంగా విడాకుల విషయంలో మహిళలకు సపోర్ట్ అంతగా ఉండటం లేదు. అయితే ఇప్పటి తరానికి, మహిళలు తమ జీవితాన్ని స్వేచ్ఛగా జీవించాలనే దృక్పథం పెరిగింది. కానీ ఆచరణలో, అదే సమాజం తన నియమాలను వారి మీద రుద్దుతుంది. ఒక మగవాడు విడాకులు తీసుకున్నా, అతడికి మళ్లీ పెళ్లి జరగడం సహజంగా కనిపిస్తుంది. కానీ ఒక విడాకులు పొందిన మహిళ కొత్త జీవితం మొదలుపెట్టాలనుకుంటే, ఆమెను ఎన్నో ప్రశ్నలు వేధిస్తాయి. విడాకుల తర్వాత ఒంటరి తల్లులు మరింత సవాళ్లను ఎదుర్కొంటారు. పిల్లల బాధ్యతలు, ఆర్థిక పరిస్థితి, సమాజపు విమర్శలు.. ఇవన్నీ కొత్త జీవితాన్ని మళ్లీ మొదలుపెట్టడంలో అడ్డంకులుగా మారతాయి.
వాళ్ల సమస్యలు అన్నీఇన్నీకావు..
ఒంటరి తల్లులు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ, కొత్త సంబంధాలను లైట్‌గా తీసుకోలేరు. పిల్లల మనస్తత్వాన్ని దృష్టిలో పెట్టుకొని.. వారు ఎలాంటి ప్రభావానికి లోనవుతారనే అంశాన్ని ముందుగా అర్థం చేసుకోవాలి. కొంతమంది మహిళలు విడాకుల తర్వాత ఆర్థికంగా బలంగా ఉండటంతో వారి జీవితంలో కొత్త ప్రేమను స్వీకరించేందుకు కొంత వెసులుబాటు ఉంటుంది. కానీ ఆర్థికంగా బలహీనమైనవారికి మళ్లీ ఒక సంబంధాన్ని కొనసాగించడంలో చాలా ఇబ్బందులు వస్తాయి. ఒక తల్లిగా ఉన్న మహిళ పెళ్లి చేసుకోవాలని భావిస్తే.. పిల్లల కోసం పెళ్లి మానేయడం మంచిది అనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తుంది. పురుషులు కూడా విడాకులు తీసుకున్న మహిళలకు పిల్లలుంటే భారంగా భావించి పెళ్లి చేసుకునేందుకు, బాధ్యతలు పంచుకునేందుకు వెనుకడుగేస్తున్నారు.
కొన్ని సందర్భాల్లో, గత అనుభవాలు కూడా కొత్త సంబంధాన్ని అంగీకరించడంలో ఆటంకంగా మారతాయి. గతంలో జరిగిన అవమానాలు, బాధలు, మోసాలు.. ఇవన్నీ మళ్లీ నమ్మకాన్ని పెంచుకోవడానికి ఓ రకమైన అడ్డంకిగా మారతాయి. విడాకుల తర్వాత చాలామంది మహిళలు కొత్త వ్యక్తుల్ని నమ్మడంలో ఆచితూచి వ్యవహరిస్తారు. కొందరు వ్యక్తులు వారి పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినా, మళ్లీ బాధపడతామనే భయంతో మహిళలు దూరంగా ఉండేవారే ఎక్కువ. ఇంకొందరు మహిళలు కొత్త సంబంధం గురించి తగినంత క్లారిటీ లేకుండా ముందుకు వెళ్ళి సంబంధం సరిగ్గా సాగనప్పుడు మళ్లీ మానసిక ఒత్తిడికి గురవుతారు. అందుకే ఏ లక్ష్యంతో కొత్త సంబంధం పెట్టుకుంటున్నామనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవడం అవసరం.
Investors Lose: ఒక్కరోజే రూ. 4 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు.. ప్రధానంగా ఈ స్టాక్స్..
అటు విడాకులు పొందిన పురుషులు కూడా సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ, మహిళలతో పోలిస్తే వారికి సమాజం నుంచి కొంత మద్దతు లభిస్తుంది. కొందరు మహిళలు భవిష్యత్తు భద్రత కోసం విడాకులు పొందిన మగవారిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతున్నారు. అలా పిల్లల బాధ్యతల నుంచి పురుషులకు త్వరగా విముక్తి పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భారతీయ సంస్కృతిలో పిల్లల సంరక్షణ బాధ్యతలు తల్లిపైనే ఎక్కువగా ఉంటాయి.
అయితే ఇవన్నీ కాదు.. అమ్మాయిలు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. విడాకులతో జీవితం ముగిసినట్లు కాదు. కొత్త జీవితం, కొత్త ప్రేమ.. వీటి పొందేందుకు ప్రతి ఒక్కరికీ హక్కు ఉంది. జీవితంలో సంతోషాన్ని కనుగొనడం ఒక్కరికీ ప్రత్యేకమైన ప్రయాణం. అనుభవాలను పాఠాలుగా మార్చుకుని, కొత్త జీవితాన్ని స్వీకరించేందుకు ధైర్యంగా ముందుకు వెళ్లాలి.
Read Also : ఇంట్లో పనులు చకచకా చేస్తూ.. కాఫీ అందిస్తున్న రోబో..
ఈ 5 శరీర భాగాలను.. చేతులతో తరచూ తాకితే ఇన్ఫెక్షన్..
బ్రదర్ అది కుక్క అనుకున్నావా? పులికి కర్ర చూపిస్తే ఏం చేసిందో చూడండి..
మరిన్ని ప్రత్యేక, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..