Share News

Investors Lose: ఒక్కరోజే రూ. 4 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు.. ప్రధానంగా ఈ స్టాక్స్..

ABN , Publish Date - Feb 24 , 2025 | 05:12 PM

భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు (ఫిబ్రవరి 24న) భారీగా క్రాష్ అయ్యాయి. దీంతో మదుపర్లు కొన్ని గంటల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలను నష్టపోయారు. ఈ క్రమంలో ప్రధానంగా నష్టపోయిన స్టాక్స్ వివరాలను ఇక్కడ చూద్దాం.

Investors Lose: ఒక్కరోజే రూ. 4 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు.. ప్రధానంగా ఈ స్టాక్స్..
Investors Lose 4 Lakh Crore

దేశీయ స్టాక్ మార్కెట్లలో (stock markets) వారాంతంలో మొదటిరోజైన నేడు (ఫిబ్రవరి 24న) బేర్ హావా కొనసాగింది. ఈ క్రమంలో వరుసగా ఐదో ట్రేడింగ్ రోజు కూడా స్టాక్ మార్కెట్‌లో భారీగా క్షీణత నమోదైంది. ప్రధాన సూచీలు మొత్తం దిగువకు పయనించాయి. ఈ క్రమంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 856.65 పాయింట్లు పడిపోయి 74,454.41 స్థాయికి చేరుకోగా, నిఫ్టీ 50 కూడా 242.55 పాయింట్లు తగ్గి 22,553.35 వద్ద ముగిసింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 329 పాయింట్లు పడిపోయి 48,651 స్థాయిలో ఉండగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 473 పాయింట్లు దిగజారింది.


కొన్ని గంటల్లోనే..

ఈ క్రమంలో ఐదో సెషన్‌లో సెన్సెక్స్, నిఫ్టీ పతనమవడంతో పెట్టుబడిదారులు రూ. 402.20 లక్షల కోట్లు నష్టపోయారు. ఫిబ్రవరి 21న బీఎస్‌ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ. 402 లక్షల కోట్లుగా ఉండగా, ప్రస్తుత సెషన్‌లో పెట్టుబడిదారుల సంపద రూ. 397.90 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు దాదాపు రూ. 4.38 లక్షల కోట్లు కోల్పోయారు. ఈ క్రమంలో నిఫ్టీ 50, సెన్సెక్స్ దాదాపు 4 శాతం పడిపోయాయి. సెప్టెంబర్ 27, 2024 గరిష్ట స్థాయి తర్వాత నిఫ్టీ 13.8 శాతం, సెన్సెక్స్ 12.98 శాతం తగ్గిపోవడం విశేషం.


టాప్ 5 లాసింగ్ స్టాక్స్

ఈ క్రమంలో విప్రో, HCL టెక్, TCS, ఇన్ఫోసిస్, భారతి ఎయిర్‌టెల్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉండగా, M&M, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐచర్ మోటార్స్, హీరో మోటోకార్ప్, కోటక్ మహీంద్రా సంస్థల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి. 30 షేర్ల BSE సెన్సెక్స్‌లో 7 మాత్రమే గ్రీన్‌లో ముగిశాయి. మరోవైపు నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా ఒక శాతం పడిపోయాయి. ఇక రంగాలవారీ చూస్తే నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మెటల్‌లో గరిష్ట అమ్మకాలు కనిపించాయి. ఈ రెండు సూచీలు 2 శాతానికి పైగా తగ్గిపోయాయి.


వరుసగా ఐదు నెలల నుంచి..

బెంచ్‌మార్క్ ఇండెక్స్ నిఫ్టీ గత ఐదు నెలలుగా వరుసగా పడిపోతోంది. ఈ నేపథ్యంలో 1996 తర్వాత ఇదే అతిపెద్ద క్షీణత అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే నిఫ్టీ 50, సెన్సెక్స్ గత ఎనిమిది నెలల్లో కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. బలహీనమైన కార్పొరేట్ ఫలితాలు, విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు, ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత తగ్గించాయని అంటున్నారు.


ఇవి కూడా చదవండి:

Apple iPhone: మార్కెట్లోకి కొత్త ఐఫోన్ మోడల్.. ఈనెల 28 నుంచి సేల్, 10 వేలు తగ్గింపు ఆఫర్


OpenAI: ఓపెన్ ఏఐ నుంచి కొత్తగా ఏఐ ఏజెంట్.. దీని స్పెషల్ ఏంటంటే..


Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Best FD Rates: సీనియర్ సిటిజన్లకు గ్యారెంటీడ్ రిటర్న్స్.. రూ. లక్ష FDపై ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 24 , 2025 | 07:41 PM