Shubhanshu Shukla: అంతరిక్షం నుంచి తీసిన టైమ్ లాప్స్ వీడియో.. శుభాన్షూ శుక్లా షేర్ చేసిన ఈ దృశ్యాన్ని చూస్తే..
ABN , Publish Date - Aug 22 , 2025 | 11:56 AM
అంతరిక్షం నుంచి భారత్‌ను చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలియజేసే వీడియోను వ్యోమగామి శుభాన్షూ శుక్లా తాజాగా షేర్ చేశారు. ప్రస్తుతం ఇది తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: అంతరిక్షం నుంచి భారత్ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చెబుతూ వ్యోమగామి శుభాన్షూ శుక్లా తాజాగా టైమ్ లాప్స్ వీడియోను షేర్ చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ వీడియో తీసినట్టు చెప్పారు.
‘ల్యాండ్ స్కేప్ మోడ్‌లో స్క్రీన్‌ను ఫుల్ బ్రైట్‌నెస్‌లో పెట్టుకుని ఈ వీడియోను చూడండి. అంతరిక్ష కేంద్రంలో ఉన్నప్పుడు ఈ వీడియోను రికార్డు చేశా. నా ప్రయాణంలో ఎదురైన అద్భుత దృశ్యాన్ని మీతో షేర్ చేస్తున్నా. ఇది అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపిస్తుందో చెప్పే టైమ్ ల్యాప్స్ వీడియో’ అని అన్నారు.
వీడియోలోని దృశ్యాల గురించి కూడా శుభాన్షూ శుక్లా వివరించారు. వీడియో కనిపిస్తున్న కాంతి పుంజాలు భారత గగనతలంలో కనిపించే మెరుపులని అన్నారు. హిమాలయాలను కూడా వీడియోలో చూడొచ్చని తెలిపారు. సూర్యోదయం కూడా కనిపిస్తుందని అన్నారు. వానాకాలం కారణంగా భారత గగనతలంలో దట్టమైన మేఘాలు అలుముకున్నప్పటికీ కొన్ని ఫొటోలు మాత్రం తీయగలిగానని ఆయన చెప్పుకొచ్చారు. ‘నేను అంతరిక్షంలో ఉండగా భారత్‌ను చూసి ఎలాంటి అనుభూతి చెందానో మీకూ తెలియాలనే ఈ వీడియోను షేర్ చేశాను’ అని అన్నారు.
గురువారం శుభాన్షూ శుక్లా ఢిల్లీలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఇస్రో అధికారులతో కలిసి పత్రికా సమావేశంలో పాల్గొన్నారు. యాక్సియమ్-4 మిషన్ ఓ చారిత్రాత్మక ఘట్టమని వ్యాఖ్యానించారు. ఇది ప్రతి భారతీయుడికి చెందిన మిషన్ అని అన్నారు. భారత ప్రభుత్వం, ఇస్రో అధికారులు, పరిశోధకులు, పౌరులకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అంతరిక్షం నుంచి భారత్‌ను చూస్తుంటే మనసులో భావోద్వేగాలు ఉప్పొంగాయని అన్నారు. ఎప్పటికైనా అన్నింటికంటే మిన్న మాతృదేశమేనని అన్నారు. యాక్సిమ్-4 మిషన్‌కు సంబంధించిన వివరాలను పంచుకున్నారు. స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ క్యాప్సుల్‌లో ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా అంతరిక్ష కేంద్రానికి వెళ్లామని చెప్పారు. ఫ్లోరిడాలోని కేప్ కెనావరల్ నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించారని చెప్పారు.
ఇవీ చదవండి:
వామ్మో.. భలే సీన్.. వందేళ్ల నాటి చర్చ్‌ను ఒక చోట నుంచి మరో చోటకు తరలింపు
పుతిన్ అంటే ఇదీ.. ఈ అమెరికా వ్యక్తికి ఎలాంటి గిఫ్ట్ ఇచ్చాడో చూస్తే