Women Viral Video: హుండీ నిండిందని సంతోషంగా పగులగొట్టింది.. లోపలి దృశ్యం చూసి ఖంగుతింది!
ABN , Publish Date - Oct 14 , 2025 | 07:38 AM
ఒక మహిళ ఏళ్లతరబడి తన చిన్న చిన్న పొదుపును పింగాణీ హుండీలో కూడబెట్టి.. అది నిండిన తరువాత పగులగొట్టి డబ్బును లెక్కించుకోవాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా తన హుండీ నిండిపోగా ఎంతో ఉత్సాహంగా వీడియో తీస్తూ పగులగొట్టింది. దీంతో అందులోని డబ్బులు చూసి ఒక్కసారిగా ఆమె ఆశలు ఆవిరయ్యాయి. జమచేసిన డబ్బులతో ఏదైనా వస్తువులు కొంటానని భావించిన మహిళకు చేదు అనుభవం ఎదురైంది.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 14: డబ్బులు పోగు చేయడం మనకు చిన్నప్పటినుంచి మన తల్లిదండ్రులు నేర్పుతుంటారు. చిన్నప్పుడు జాతర సమయంలో పింగాణీ హుండీ (గల్ల గురిగి) కొనుక్కొని రూపాయి రూపాయి పోగుచేస్తూ కొన్ని ఏళ్ళ తర్వాత దానిని దానిని పగులగొట్టి మనం పోగుచేసుకున్న డబ్బును పగలగొట్టి డబ్బును లెక్కించుకొని ఆనందపడుతాం. కొందరు ఆడపిల్లలు లేదా మగ వారికి చిన్నప్పటినుంచి ఉన్న అలవాటు పెద్దవారు అయ్యాక కూడా పాటిస్తూనే ఉంటారు. పెద్దయ్యాక జాబ్, ఫామిలీతో గడుపుతున్న సమయంలో ఇలా మట్టి లేదా పింగాణీ గల్లాపెట్టి కొనుక్కొని అత్యవసర సమయం వరకు తమ డబ్బులను దాచుకుని.. ఆ తరువాత దానిని పగులగొట్టి తాము పోగుచేసిన డబ్బునంతా లెక్కించుకొని ఆనందపడుతుంటారు. ఇలాగే పింగాణీ హుండీలో డబ్బును దాచుకున్న మహిళకు బిగ్ షాక్ తగిలింది. సంవత్సరాలుగా తాను దాచుకున్న డబ్బును లెక్కిద్దామని అనుకునేసరికి ఆమె ఆశలు ఆవిరయ్యాయి. ఇంతకీ ఆమె ఎందుకు ఆశ్చర్యపోయిందో ఇప్పుడు చూద్దాం.
ఒక మహిళ ఏళ్లతరబడి తన చిన్న చిన్న పొదుపును పింగాణీ హుండీలో కూడబెట్టి.. అది నిండిన తరువాత పగులగొట్టి డబ్బును లెక్కించుకోవాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా తన హుండీ నిండిపోగా ఎంతో ఉత్సాహంగా వీడియో తీస్తూ పగులగొట్టింది. దీంతో అందులోని డబ్బులు చూసి ఒక్కసారిగా ఆమె ఆశలు ఆవిరయ్యాయి. జమచేసిన డబ్బులతో ఏదైనా వస్తువులు కొంటానని భావించిన మహిళకు చేదు అనుభవం ఎదురైంది. పింగాణీ హుండీలోని డబ్బును చెద పురుగులు తినేసింది. హుండీలోని కరెన్సీ నోట్లు సగం ముక్కలై కనిపించాయి. చివరకు ఎన్నో ఏళ్లుగా ఆ మహిళ పెట్టుకున్న ఆశలు అడియాశలు అయ్యాయి. ఈ దృశ్యాన్ని చూసిన ఆమె గుండె బద్దలయినట్లయింది. ఈ వీడియోను సోషల్ మీడియాతో పంచుకోగా.. అది కాస్త వైరల్ అయింది.
ఇవి కూడా చదవండి:
Driver falls asleep: ట్రక్ నడుపుతూ నిద్రపోయిన డ్రైవర్.. ఏం జరిగిందో చూడండి..
Langur Attacks Biker: వీధి రౌడీలా మారిన కోతి.. బైకర్‌పై దాడి..