Driver falls asleep: ట్రక్ నడుపుతూ నిద్రపోయిన డ్రైవర్.. ఏం జరిగిందో చూడండి..
ABN , Publish Date - Oct 13 , 2025 | 07:56 PM
డ్రైవింగ్ చేసేటపుడు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా జాతీయ రహదారులపై భారీ వాహనాలను నడిపేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. తగినంత నిద్రపోయిన తర్వాతే డ్రైవింగ్‌కు సిద్ధపడాలి. లేకపోతే భారీ ప్రమాదాలకు గురి కావాల్సి ఉంటుంది.
డ్రైవింగ్ చేసేటపుడు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా జాతీయ రహదారులపై భారీ వాహనాలను నడిపేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. తగినంత నిద్రపోయిన తర్వాతే డ్రైవింగ్‌కు సిద్ధపడాలి. లేకపోతే భారీ ప్రమాదాలకు గురి కావాల్సి ఉంటుంది. తాజాగా ఓ డ్రైవర్‌కు అలాంటి పరిస్థితే ఎదురైంది. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో సదరు డ్రైవర్ రెండు క్షణాలు నిద్రపోయాడు. అందువల్ల భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (highway accident video).
@VehicleTracker8 అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. జింబాబ్వేకు చెందిన ట్రక్ డ్రైవర్ జాతీయ రహదారిపై వేగంగా వాహనాన్ని నడుపుతున్నాడు. ఆ సమయంలో అతడి కళ్లు మూతలు పడ్డాయి. అనుకోకుండా నిద్రలోకి జారుకున్నాడు. దీంతో ట్రక్ బ్యాలెన్స్ తప్పింది. ట్రక్ అదుపు తప్పిన తర్వాత డ్రైవర్ మేల్కొన్నాడు. అయితే అప్పటికే ట్రక్ బోల్తా పడింది. ఈ ఘటన మొత్తం ఆ ట్రక్ బయట, లోపల అమర్చిన డాష్ క్యామ్‌లో రికార్డ్ అయింది (viral crash footage).
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (shocking road incident). ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు కోట్ల మంది వీక్షించారు. ఏడు వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. భారీ వాహనాలకు ఎప్పుడూ ఇద్దరు డ్రైవర్లు ఉండాలని ఒకరు కామెంట్ చేశారు. డ్రైవింగ్ సమయంలో ఒక్కసారి కళ్లు మూతలు పడితే ఏదీ మన కంట్రోల్‌లో ఉండదని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
స్కూల్ నుంచి పారిపోయాడు.. బుర్జ్ ఖలీఫా వరకు ఎదిగాడు.. సక్సెస్ స్టోరీ..
షాకింగ్ యాక్సిడెంట్.. బైక్ కోసం ఆలోచించి ప్రాణాలు పోగొట్టుకున్నాడు..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..