Share News

Sankranti Special: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. అయితే ఇవి మీకోసమే..

ABN , Publish Date - Dec 28 , 2025 | 08:26 AM

వచ్చే సంక్రాంతికి నెలల ముందే ఈసారి పండుగ వాతావరణం జోరందుకుంది. ఈ పండుగను పురస్కరించుకుని సొంతూళ్లలో బంధువులతో గడిపేందుకు ప్రజలు ఇదో మంచి అవకాశంగా భావించడమే ఇందుకు కారణం. ఆయా ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ఈ ప్రత్యేక చిట్కాలివిగో...

Sankranti Special: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. అయితే ఇవి మీకోసమే..
Sankranti Rush

ఇంటర్నెట్ డెస్క్: నూతన సంవత్సరం రాకముందే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి(Sankranti) కోలాహలం మొదలైంది. జనవరిలో ఎక్కువ రోజులు సెలవులు రావడంతో ఈ పండుగకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ప్రయాణికులు.. తమ సొంతూళ్లకు వెళ్లేందుకు బస్సులు, రైళ్లు, విమానాల్లో ఇప్పటికే రిజర్వేషన్(Reservations) టికెట్లు బుక్ చేసుకోవడంతో.. టికెట్ దొరకడం కష్టంగా మారింది. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు భారీగా టికెట్ ధరల్ని పెంచేసి సొమ్ము చేసుకుంటున్నాయి. మీరూ సంక్రాంతి ప్రయాణం కోసం సిద్ధమవుతున్నారా.? అయితే.. ఈ చిట్కాలను(Travelling Precautions) పాటించి మీ పయనాన్ని మరింత సులభతరం చేసుకుని, సుఖవంతంగా గమ్యస్థానాలకు చేరుకోండి.. ఆనందంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోండి.


ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే.. ప్రత్యేక రైళ్లను (Special Trains) నడుపుతాయి. సాధారణంగా జనవరి 10 నుంచి 19 వరకు వీటి సేవలు అందుబాటులో ఉండే అవకాశముంది. ప్రభుత్వ, ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ప్రత్యేక సర్వీసులను ఏర్పాటుచేస్తాయి. కానీ ప్రయాణికుల రద్దీని బట్టి టికెట్ ధరలు అమాంతం పెరిగే అవకాశముంది. ఇక విమాన టికెట్ రేట్లూ ఇప్పటికే ఆకాశన్నంటగా.. ప్యాసెంజర్స్ పెరిగితే.. వీటి ధరలు మరింత పెరిగే అవకాశముంది.


సంక్రాంతి వేళ.. ఆయా ఊళ్లకు వెళ్లేవారి సంఖ్య అధికంగా ఉండటంతో రైల్వే, బస్ స్టేషన్లు కిక్కిరిసిపోయే అవకాశముంది. కాబట్టి.. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో మీ లగేజీ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. పిల్లలు, వృద్ధులతో ప్రయాణించేటప్పుడు అవసరమైన మందులు, ఆహార పదార్థాలను వెంటబెట్టుకోవడం మరవద్దు. బయటదొరికే ఆహారానికి ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యకరం.

పండుగ రోజులు ముగిశాక.. తిరిగి ఆయా పట్టణాలకు వెళ్లే ప్రయాణం కూడా జనవరి మధ్యలో అధికంగా ఉండే అవకాశముంటుంది. హైదరాబాద్ వంటి నగరాల నుంచి ఇరు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలకు ముఖ్యంగా పల్లెటూళ్లకు ప్రయాణించేవారు అధికంగా ఉంటారు. కొన్నిసార్లు ప్రైవేట్ వాహనాలు, ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా ప్రయాణించాల్సి రావచ్చు, కనుక వాటి ధరలను సరిచూసుకోవాలి.


ఇక సొంత వాహనాల్లో ప్రయాణించే వారికోసం ఈ చిట్కాలు..

⦁ టోల్ ప్లాజాల వద్ద రద్దీ ఎక్కువగా ఉంటుంది. మీ వాహన FASTag వివరాలను ఒకసారి చెక్ చేసుకుని, సరిపడా సొమ్మును ముందే రీఛార్జ్ చేసుకోండి.

⦁ గూగుల్ మ్యాప్స్(Google Maps) ద్వారా ట్రాఫిక్ తక్కువగా ఉన్న మార్గాలను ఎంచుకోండి.

⦁ లాంగ్ డ్రైవ్‌కు వెళ్లే ముందు టైర్లు, ఇంజిన్ ఆయిల్, బ్రేకులు, వెహికల్ కండీషన్ వంటివాటిని ముందే తనిఖీ చేయించుకోవడం ఉత్తమం.

సంక్రాంతి ప్రయాణం ఒక పండుగలో భాగం. అయినప్పటికీ రద్దీ, ఖర్చుల వల్ల కొందరికి కష్టంగా మారినా.. సొంతూళ్లలో బంధువులతో గడిపేందుకు ఇదో మంచి అవకాశంగా ప్రజలు భావిస్తారు.


ఇవీ చదవండి:

పులికి భయం అంటే ఏంటో చూపించిందిగా.. నీళ్లు తాగడానికి వెళ్లగానే..

కొండపై దైవ దర్శనానికి వెళ్తున్న భక్తులు.. సడన్‌గా దూసుకొచ్చిన సింహం.. చివరకు చూస్తే..

Updated Date - Dec 28 , 2025 | 08:43 AM