Share News

Music Box Viral: జియోమెట్రీ బాక్స్‌తో మ్యూజిక్‌ క్రియేట్ చేసిన స్టూడెంట్స్‌.. వీడియో వైరల్

ABN , Publish Date - Mar 10 , 2025 | 06:13 PM

Students Music Box Viral Video : వాళ్లేం మ్యూజిక్ మాస్టర్స్ కాదు. సంగీతంపై అవగాహన అసలే లేదు. కానీ అద్భుతమైన ప్రాజెక్టు క్రియేట్ చేసి వండర్‌ఫుల్ స్టూడెంట్స్ అంటూ నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నారు. ఇంతకీ వారేం సృష్టించారంటే..

Music Box Viral: జియోమెట్రీ బాక్స్‌తో మ్యూజిక్‌ క్రియేట్ చేసిన స్టూడెంట్స్‌.. వీడియో వైరల్
Pune Students Music Box Viral Video

Students Music Box Viral Video : పుణే నగరానికి చెందిన కొంతమంది స్కూల్ విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రదర్శిస్తూ ఒక చిన్న వీడియోతో ఇంటర్నెట్‌ను షేక్ చేశారు. క్లాస్‌రూమ్‌లో మామూలు వస్తువులను ఉపయోగించి సూపర్ బీట్‌లను తయారు చేసిన ఈ విద్యార్థుల ప్రతిభను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. Project Asmi అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ ఈ వీడియోను షేర్ చేయగా.. ఇది ఇప్పటివరకు 30 మిలియన్ వ్యూస్ దాటేసింది. ఈ విద్యార్థులు ఏవైనా ప్రత్యేకమైన సంగీత సాధనాలను ఉపయోగించలేదూ! వారి చేతిలో ఉన్న జ్యామితి బాక్స్, బెంచ్, వాటర్ బాటిల్ లాంటి సాధారణ వస్తువులనే సంగీత సాధనాలుగా మార్చి, అదిరిపోయే రిధమ్‌ను సృష్టించారు. సమన్వయంతో ప్రదర్శించిన వారి టాలెంట్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.


అమేజింగ్ స్టూడెంట్స్..

క్లాస్‌లో విద్యార్థుల సంగీత ప్రదర్శన చూసిన టీచర్లు కూడా ఎంతో ఆనందించారు.వారు ఈ టాలెంట్‌ను ప్రశంసిస్తూ విద్యార్థులకు స్పూర్తినిచ్చారు. ఇక వీడియో చూస్తూనే నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపించారు. "విద్యార్థుల ఎనర్జీ అమేజింగ్!", "ఇదే నిజమైన టాలెంట్!" అంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోకు వేల కొద్దీ లైక్‌లు, షేర్‌లు రావడంతో పాటు hyperquest, madan_chikna లాంటి ప్రముఖ ఇన్‌ఫ్లూయెన్సర్లు కూడా కామెంట్ చేశారు."టీచర్ ఎదుటే ఇంతకంటే మంచి వినోదం ఏది ఉండదు!","బ్యాక్‌బెంచర్లు మాత్రమే ఇలా చేస్తారు!" అంటూ సరదా కామెంట్లు పెడుతున్నారు.


వీరి ప్రతిభ చూసిన కొందరు సంగీత ప్రియులు వీరికి ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇస్తే ఇంకా గొప్ప స్థాయికి వెళ్తారని అభిప్రాయపడుతున్నారు. పుణే స్కూల్ విద్యార్థుల చిన్న వీడియో వారిని దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడమే కాకుండా.. వారి సంగీత ప్రయాణానికి ఒక మంచి దారి చూపించిందనే చెప్పాలి.


Read Also : బోనులోకి వెళ్లి గుడ్డును మింగిన పాము.. చివరకు దాని పరిస్థితి ఏమైందంటే..

బరువు తగ్గేందుకు కఠిన డైటింగ్.. టీనేజర్ దుర్మరణం

ఫోన్‌‎లో మాట్లాడుతూ పాపను మరచి వెళ్లిన తల్లి

Updated Date - Mar 10 , 2025 | 06:18 PM