Share News

Snake Viral Video: బోనులోకి వెళ్లి గుడ్డును మింగిన పాము.. చివరకు దాని పరిస్థితి ఏమైందంటే..

ABN , Publish Date - Mar 10 , 2025 | 03:51 PM

కొండచిలువలు తమ కంటే పరిమాణంలో పెద్దవైన జంతువులను కూడా మింగేస్తాయి. పాములు కూడా ఒక్కోసారి పెద్ద కప్పలను, ఎలుకలను మింగేసి ఇబ్బందుల్లో పడుతుంటాయి. తాజాగా ఓ పాము ఓ పెద్ద గుడ్డుని మింగేసింది. ఆ తర్వాత దానికి సమస్యలు మొదలయ్యాయి.

Snake Viral Video: బోనులోకి వెళ్లి గుడ్డును మింగిన పాము.. చివరకు దాని పరిస్థితి ఏమైందంటే..
snake swallows the egg

పాములు (Snakes) ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జంతువులు. విషపూరిత సర్పాలు కాటేస్తే ప్రాణాలు మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఇక, కొండచిలువలు (Python) తమ కంటే పరిమాణంలో పెద్దవైన జంతువులను కూడా మింగేస్తాయి. పాములు కూడా ఒక్కోసారి పెద్ద కప్పలను, ఎలుకలను మింగేసి ఇబ్బందుల్లో పడుతుంటాయి. తాజాగా ఓ పాము ఓ పెద్ద గుడ్డుని మింగేసింది. ఆ తర్వాత దానికి సమస్యలు మొదలయ్యాయి. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


@chude అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ పాము ఓ బోనులోకి ప్రవేశించింది. బోనులో ఉన్న పెద్ద గుడ్డును మింగేసింది. అయితే ఆ పాము బోను నుంచి తిరిగి బయటకు వెళ్లడానికి ఇబ్బంది పడింది. దాని గొంతులో గుడ్డు ఉండిపోవడంతో సన్నని బోను నుంచి ఆ పాము బయటకు వెళ్లలేకపోయింది. ఆ సమయంలో ఓ వ్యక్తి అక్కడకు వచ్చి టార్చ్‌లైట్ వేసి చూశాడు. పాము బయటకు వెళ్లలేకపోవడాన్ని గమనించాడు. అప్పటికే ఆ పాము తన గొంతులోని గుడ్డును బయటకు ఉమ్మేయడానికి ప్రయత్నిస్తోంది (snake swallows the egg).


పాము నోట్లో ఉన్న గుడ్డు బయటకు వచ్చేసేలా ఆ వ్యక్తి టార్చ్‌తో కొట్టాడు. దీంతో ఆ గుడ్డు బయటకు వచ్చేసింది. ఆ ఘటనను రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోను ఇప్పటివరకు 1.2 కోట్ల మందికి పైగా వీక్షించారు. 21 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

Boy Stunt Video: ఈ కుర్రాడి ప్రతిభకు సలాం కొట్టాల్సిందే.. సైకిల్‌తో కళ్లు చెదిరే స్టంట్ చూస్తే..


Optical Illusion: మీ కళ్లకు శక్తి ఉంటే.. ఈ ఫొటోలో దాక్కున్న కుక్కను 5 సెకెన్లలో కనుక్కోండి..


China Viral News: విమానంలో నాకు సూది గుచ్చుకుంది.. నష్ట పరిహారం ఇవ్వండి.. ఎయిర్‌లైన్స్‌పై దావా..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 10 , 2025 | 03:51 PM