PM Kisan: 19 విడత ఆర్థిక సాయం.. జాబితాలో మీ పేరు ఉందా.. ఇలా చెక్ చేసుకోండి..
ABN , Publish Date - Jan 02 , 2025 | 08:42 PM
రైతులను ఆర్థికంగా ఆదుకునే ఉద్దేశంతో కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం.. పీఎం కిసాన్ సమాన్ నిధి పేరుతో ఆర్థిక సాయం అందజేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సహకారంతో భారత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. అయితే..

రైతులను ఆర్థికంగా ఆదుకునే ఉద్దేశంతో కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం.. పీఎం కిసాన్ సమాన్ నిధి పేరుతో ఆర్థిక సాయం అందజేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సహకారంతో భారత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌కు సంబంధించిన ఆర్థిక సాయాన్ని 18 విడతలుగా అందజేసింది. తాజాగా, 19 విడత ఆర్థిక సాయాన్ని త్వరలో విడదల చేయనుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
పీఎం కిసాన్ (PM Kisan) సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన 19వ విడత నిధులను ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద రైతులకు ప్రతి ఏడాదీ రూ.6,000 నగదును అందజేస్తున్నారు. ఒక్కో విడుదలో రూ.2000 చొప్పున మూడు విడతల్లో మొత్తం నగదును నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో బదిలీ చేస్తారు. ఈ పథకం కింద సుమారు 13 కోట్ల మంది రైతులకు ఆర్థిక సాయం అందుతోంది. ఈ స్కీం కోసం దరఖాస్తు చేసుకున్న వారు లబ్ధిదారుల జాబితాలను పరిశీలించుకునే అవకాశం ఉంది. 2 హెక్టార్లలోపు సాగుభూమి ఉన్న రైతులంతా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే..
ముందుగా PM KISAN వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
New Farmer Registrationపై క్లిక్ చేయాలి.
అందులో ఆధార్, జిల్లా, రాష్ట్రం తదితర వివరాలన్నీ నమోదు చేయాలి.
లబ్ధిదారుల జాబితా ఇలా చెక్ చేసుకోండి..
ఇందుకోసం www.pmkisan.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
అందులో ‘‘Beneficiary List’’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
అందులో మీ చిరునామా వివరాలను సెలెక్ట్ చేసుకోవాలి.
ఆ తర్వాత ‘‘Get Report’’ పై క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు.
నగదు పడిందో లేదో ఇలా చూసుకోవచ్చు..
ఇందుకోసం https://pmkisan.gov.in/ పోర్టల్ లోకి వెళ్లాల్సి ఉంటుంది.
అందులో ‘‘Know Your Status’’ పై క్లిక్ చేయాలి.
తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి, క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత ‘‘Get OTP’’పై క్లిక్ చేయడం ద్వారా వివరాలను తెలుసుకోవచ్చు.