Share News

Lifestyle: జీవితంలో సంతోషం ఉచ్ఛస్థితికి చేరేది ఈ ఏజ్‌లోనే అంటున్న శాస్రవేత్తలు

ABN , Publish Date - Feb 03 , 2025 | 11:32 PM

పేద మధ్యాదాయ దేశాల్లో మధ్యవయస్కులే అత్యధి ఆనందాన్ని అనుభవిస్తున్నారని యూనివర్సిటీ కాలిఫోర్నియాకు చెందిన ఓ ప్రొఫెసర్ పేర్కొన్నారు. సంపన్న దేశాల్లో మాత్రం పిల్లలు, వయసు మళ్లిన వారే సంతృప్తికర జీవనం సాగిస్తారని తేల్చి చెప్పారు.

Lifestyle: జీవితంలో సంతోషం ఉచ్ఛస్థితికి చేరేది ఈ ఏజ్‌లోనే అంటున్న శాస్రవేత్తలు

ఇంటర్నెట్ డెస్క్: యవ్వనంలో పతాకస్థాయికి చేరే సంతోషం మళ్లీ మధ్యవయసు వచ్చే సరికి కనిష్టస్థాయికి చేరి రిటైర్మెంట్ తరువాత మళ్లి పుంజుకుంటుందనేది పాశ్చాత్యాదేశాల్లో ఉన్న భావన. అయితే, ఈ సూత్రం అల్ప, మధ్యాదాయ దేశాలకు వర్తించదని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన ప్రొఫెసర్ మైఖేల్ గుర్వెన్ పేర్కొన్నారు (Viral).

Metabolism Slowing Down: ఈ మార్పులు కనిపిస్తే జాగ్రత్త.. మీ జీవ క్రియలు నెమ్మదిస్తున్నట్టే!


పేద, వనరులు సరిగా లేని దేశాల్లో మధ్యవయస్కులే సంతోషంగా ఉంటారట. యువత, వృద్ధుల్లో ఆనందం అంతగా కనిపించదని సదరు శాస్త్రవేత్త చెబుతున్నారు. మొత్తం 23 దేశాలను అధ్యయనం చేశాక తానీ అంచనాకు వచ్చినట్టు వివరించారు. పేద దేశాల్లోని మధ్యవయస్కుల వారి సంతోషం వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతుందని పేర్కొన్నారు. సామాజిక భద్రత, ఇతర వ్యవస్థలు అందుబాటులో లేకపోవడమే దీనికి కారణమని అన్నారు. అయితే, సంతోషం అనేది కేవలం వయసుపైనే ఆధార పడి ఉండదని కూడా ప్రొఫెసర్ స్పష్టం చేశారు. అనారోగ్యం, వైకల్యం, ఉత్పాదక తగ్గిపోవడంతో వంటివన్నీ సంతోషాన్ని ప్రభావితం చేస్తాయని వెల్లడించారు.


Oyo: ఓయో వల్ల రైల్వే ప్లా్ట్‌ఫామ్‌పై నిద్ర పోయా.. కస్టమర్ ఆవేదన

అధికాదాయ దేశాల్లో, నగరీకరణ ఎక్కువగా జరిగిన, సంపన్న దేశాల్లో మాత్రమే వయసు మళ్లిన తరువాత ఆనందం పతాకస్థాయికి చేరుతుందని ప్రొఫెసర్ పేర్కొన్నారు. జీవితానికి భరోసా, సామాజిక భద్రత వంటి అంశాలు వృద్ధుల్లో సంతృప్తికర జీవనానికి కారణమని అన్నారు. ఇక ఆయా సంస్కృతుల తీరుతెన్నులు కూడా వ్యక్తుల మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతాయని వివరించారు. ప్రస్తుతం అనేక దేశాల్లో వృద్ధుల సంఖ్య, యువతలో మానసిక సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో తన పరిశోధన కీలకం అవుతుందని పేర్కొన్నారు. ఈ అధ్యయనం ద్వారా అన్ని వర్గాల వారూ ఆనందంగా జీవించే చర్యలను చేపట్టే అవకాశం ప్రభుత్వాలకు లభిస్తుందని వెల్లడించారు. అన్ని వయసుల వారూ సంతృప్తికర జీవనం గడిపేలా చర్యలు తీసుకునేందుకు ఈ అధ్యయనం ఉపకరిస్తుందని అన్నారు.

Read Latest and Viral News

Updated Date - Feb 04 , 2025 | 12:00 AM