Share News

Metabolism Slowing Down: ఈ మార్పులు కనిపిస్తే జాగ్రత్త.. మీ జీవ క్రియలు నెమ్మదిస్తున్నట్టే!

ABN , Publish Date - Feb 03 , 2025 | 11:11 PM

జీవక్రియలు నెమ్మదించే సమయంలో శరీరంలో పలు మార్పులు వస్తాయి. వీటిని ముందుగానే గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకుంటే జీవితాంతం ఆరోగ్యంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

Metabolism Slowing Down: ఈ మార్పులు కనిపిస్తే జాగ్రత్త.. మీ జీవ క్రియలు నెమ్మదిస్తున్నట్టే!

ఇంటర్నెట్ డెస్క్: మనం తినే ఆహారం జీవక్రియల ద్వారానే శక్తిగా మారుతుంది. కాబట్టి, నిత్యం ఆరోగ్యంతో ఉండేందుకు జీవక్రియలు ఎంతో కీలకం. జీవక్రియల వ్యవస్థ ఎంతో సంక్లిష్టమైనదని నిపుణులు చెబుతున్నారు. ఇవి నెమ్మదించిన సమయాల్లో బరువు పెరగడమే కాకుండా ఇతరత్రా అనేక దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి. మరి జీవక్రియలు నెమ్మిదిస్తున్నప్పుడు శరీరంలో కనిపించే సంకేతాలేవో ఈ కథనంలో తెలుసుకుందాం.

నిత్యం నీరసంగా, అలసటగా ఉండటం జీవక్రియలు నెమ్మదిస్తున్నాయనేందుకు ఓ సంకేతమని నిపుణులు చెబుతున్నారు. జీవక్రియల వేగం తక్కువగా ఉండి శరీరానికి తగినంత కెలొరీలు అందక ఇలా అనిపిస్తుందని చెబుతున్నారు (Health).


Skin Tightening Treatments: ముఖం, గొంతుపై ముడతలా? ఈ ట్రీట్‌మెంట్‌తో అద్భుత ఫలితాలు!

ఎన్ని కసరత్తులు చేసినా, ఆహార నియమాలు ఎంతగా పాటించినా బరువు తగ్గట్లేదంటే జీవక్రియలు నెమ్మదిస్తున్నాయని భావించాలి. తినే ఆహారం శక్తిగా మారకుండా కొవ్వుగా మారి శరీరంలో నిల్వ ఉన్నప్పుడు వ్యక్తులు క్రమంగా బరువు పెరుగుతారు.

తరచూ మూడ్ మారడం, మాటమాటికీ చికాకు అనిపించడం కూడా జీవక్రియలు నెమ్మదించడానికి ఓ సంకేతమట. జీవక్రియలు నెమ్మదించిన కారణంగా హార్మోన్ల మధ్య సమతౌల్యం లోపించినప్పుడు ఇలా జరుగుతుందని నిపునులు చెబుతున్నారు.


Fatty liver: అలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే ఫ్యాటీ లివర్ ఉన్నట్టు అనుమానించాలి

జీర్ణ వ్యవస్థకు జీవక్రియలకు దగ్గర సంబంధం ఉందనేది నిపుణులు చెప్పే మాట. జీవక్రియల వేగం తగ్గినప్పుడు మలబద్ధకం, కడుపుబ్బరం లేదా డయేరియా వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఇక జీవక్రియలను వెగవంతం చేసేందుకు కొన్ని కిటుకులు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. స్వల్ప వ్యవధిలో తీవ్ర కసరత్తులు చేసి ఆపై బ్రేక్ తీసుకుంటే జీవక్రియలు అప్పటికప్పుడు వేగం పుంజుకుంటాయట. బలవర్ధకమైన పోషకాహారం, నిత్యం కసరత్తులు చేసే అలవాటు ఉన్న వాళ్లల్లో జీవక్రియలు నెమ్మదించడమనే రిస్క్ చాలా తగ్గుతుందని కూడా నిపుణులు చెబుతున్నారు.

Read Latest and Health News

Updated Date - Feb 03 , 2025 | 11:11 PM