Watch Video: బామ్మ రాక్స్.. టూరిస్ట్ షాక్.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..!
ABN , Publish Date - Oct 07 , 2025 | 06:37 PM
మనదేశంలో ఉన్నటువంటి విభిన్న రకాల తెగలవారు, గిరిజన ప్రజల ధైర్య సాహసాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. వారి జీవన విధానం నిజంగా ఆశ్చర్యకరంగా, ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.
Pahadi Woman Viral Video: మనదేశంలో ఉన్నటువంటి విభిన్న రకాల తెగలవారు, గిరిజన ప్రజల ధైర్య సాహసాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. వారి జీవన విధానం నిజంగా ఆశ్చర్యకరంగా, ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. సామాన్య ప్రజల కంటే ధీటుగా ఎక్కువ పని చేస్తూ మహిళలు సైతం తమ శక్తి ఏమీ తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిమగిరుల్లో పర్యటిస్తున్న ఓ విదేశీ యువతికి ఆశ్చర్యపరిచే అనుభవం ఒకటి ఎదురైంది. ఆ వీడియోనే తాను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఓ మహిళ కష్టపడుతున్న విధానానికి అందరూ ముగ్దులయ్యారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో వైరలై ఏకంగా 2 లక్షల వ్యూస్ స్వంతం చేసుకుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? ఇప్పుడు తెలుసుకుందాం.

ఉత్తరాఖండ్‌లోని ఒక గ్రామంలో పహాడీ మహిళ అద్భుతమైన శక్తి సామర్థ్యాలను చూసి విదేశీ పర్యాటకురాలు జెమా కోల్లెల్ ఆశ్చర్యపోయారు. చామోలి గ్రామంలో ఇద్దరు మహిళల్ని చూసి ఆమె ఒక్కసారిగా ఆగిపోయారు. ఆ మహిళలు తమ పశువుల కోసం సుమారు 40 కిలోల బరువున్న గడ్డి మోపును అవలీలగా ఎత్తడంతో నిర్గాంతపోయారు. ట్రెక్కింగ్ చేసే సమయంలో 20-25 కిలోలు తీసుకుని నడిచేదానినని, ఈ పహాడీ గ్రామంలోని మహిళలు 40 కిలోల బరువును కూడా అలవోకగా ఎత్తుకుంటున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. జెమాను గమనించిన మహిళ గడ్డిమోపును ఎత్తుకోవాలని సరదాగా సవాల్ విసిరింది. గడ్డిమోపును ఎత్తేందుకు జెమా ఎంత ప్రయత్నించినా ఎత్తలేకపోయింది. ఆ తర్వాత సవాల్ విసిరిన మహిళ చాకచక్యంతో, బరువుని బ్యాలెన్స్ చేస్తూ గడ్డిమోపును ఎత్తి వాహనంలో పెట్టింది. ఇది చూసి అవాక్కైన జెమా.. గ్రేట్ అంటూ సదరు మహిళపై ప్రశంసలు కురిపించింది. ‘విదేశీయులు vs పహాడీ ప్రజలు - పోటీ ప్రసక్తే లేదు!’ అంటూ ఇన్‌స్టాగ్రమ్‌లో వీడియోను పంచుకొని.. క్యాప్షన్ కూడా పెట్టారు.
ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సదరు మహిళను అందరూ పొగుడుతున్నారు. 40 కిలోల బరువును ఎత్తడం అంత ఈజీ ఏమీ కాదని.. రియల్లీ గ్రేట్ అంటూ ప్రశంసిస్తున్నారు. ‘మా అమ్మ కూడా ఇలాగే చాలా కష్ట పడుతుంది. ఆ రోజుల్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటా. ఇలాంటి స్మృతులను మనం మర్చిపోకూడదు. పహాడీ మహిళలు ఎంత బలమైన వారో, వారు రోజూ చేసే కష్టాలు అనన్యమైనవి’ అని ఒక యూజర్ కామెంట్ చేశారు. ‘పురుషులు నగరాలకు ఉపాధి కోసం వెళ్ళిపోతే.. వారు పిల్లలను పెంచడం, పశువుల చూసుకోవడం వంటి కష్టాలను హిమగిరుల్లో ఉన్న మహిళలు భరించేవారు’ అని మరొక యూజర్ కామెంట్ పెట్టారు.
Also Read:
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ముఠా గుట్టురట్టు
ఎయిరిండియా ప్రమాదంపై దర్యాప్తు పారదర్శకం
ఫోన్‌పే, జీపేను టార్గెట్ చేసిన అరట్టై రూపకర్త.. భారీ ప్లాన్‌తో..